Arjun Kapoor: అందరికీ దూరంగా ఒంటరిగా.. అరుదైన వ్యాధితో బాధపడుతున్న అర్జున్ కపూర్!

బాలీవుడ్ నటుడు అర్జున్ తన ఆరోగ్యానికి సంబంధించి కీలక విషయాన్ని పంచుకున్నారు. గత రెండు సంవత్సరాలుగా హాషిమోటోస్ థైరాయిడిటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పారు. ఇది థైరాయిడ్ సంబంధిత సమస్యలు, రోగనిరోధక శక్తి, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

New Update
arjun kapoor

arjun kapoor

Arjun kapoor: బాలీవుడ్ హీరో అర్జున్ కపూరు 'ఏక్ విలన్ రిటర్న్స్',  'కుట్టే',  'ది లేడీ కిల్లర్' వంటి వరుస ప్లాపుల తర్వాత.. రోహిత్ శెట్టి దర్శకత్వంలో నటించిన 'సింగం ఎగైన్' తో హిట్ అందుకున్నాడు.  ఈ సినిమాలో విలన్‌ "డేంజర్ లంక" పాత్రలో అర్జున్ కపూర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పటివరకూ వరుస వరుస ప్లాపులతో ఇబ్బందిపడుతున్న అర్జున్ ఈ సినిమాతో మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చారు. 

Also Read: 3 స్టేట్స్‌.. 9 థియేటర్స్‌.. రామ్‌చరణ్‌ టీజర్ లాంచ్‌ ప్లాన్‌ చూస్తే మైండ్‌ బ్లాక్ అవ్వడం పక్కా భయ్యా!

అర్జున్ కపూర్‏కు అరుదైన వ్యాధి

ఈ క్రమంలో అర్జున్ కపూర్ తన ఆరోగ్యానికి సంబంధించి కీలక విషయాన్ని పంచుకున్నారు. ఇది అతని అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. గత రెండేళ్లుగా తాను హాషిమోటోస్ థైరాయిడిటిస్ అనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ తో బాధపడుతున్నట్లు తెలిపారు. ఇది ఇది థైరాయిడ్‌  తరువాత స్టేజీ అని.. శరీరంలో రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుందని. తాను బరువు పెరగడానికి అది కూడా కారణం కావచ్చని తెలిపారు. లావుగా ఉండడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగి అందరికీ దూరంగా ఉండేవాడినని.. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికే ఇష్ట పడేవాడినని అర్జున్ చెప్పారు.

Also Read: Bigg Boss: బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చ.. కొట్టుకున్న నబీల్- పృథ్వీ..! కంటెస్టెంట్స్ షాక్

హాషిమోటోస్ థైరాయిడిటిస్ 

మయోక్లినిక్ యొక్క నివేదిక ప్రకారం హాషిమోటోస్ వ్యాధి శరీరంలో థైరాయిడ్ గ్రంధి, రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది .థైరాయిడ్ లోపం హైపోథైరాయిడిజం పరిస్థితికి దారితీస్తుంది.  ఈ పరిస్థితిని హషిమోటో థైరాయిడిటిస్, క్రానిక్ లింఫోసైటిక్ థైరాయిడిటిస్,  క్రానిక్ ఆటో ఇమ్యూన్ థైరాయిడిటిస్ అని కూడా అంటారు. ఈ వ్యాధి శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా అతని మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. 

లక్షణాలు 

హషిమోటోస్ వ్యాధిలో, థైరాయిడ్ హార్మోన్ లోపం ఉంటుంది. ఇది అలసట, బరువు పెరగడం, మలబద్ధకం, జుట్టు రాలడం, చర్మం పొడిబారడం,  కండరాల బలహీనత, మానసిక అలసట, నిరాశ  వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

Also Read: మాటలకు కొత్త పుంతలు తొక్కించాడు.. టాలీవుడ్‌ మనసును గెలిచాడు.. మాటల మాంత్రికుడి బర్త్‌ డే స్పెషల్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు