నేరుగా ఓటీటీలోనే తమన్నా క్రైమ్ థ్రిల్లర్ విడుదల.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..? తమన్నా లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'సికందక్ కా ముఖద్దర్'. తాజాగా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. థియేటర్స్ లో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. నవంబర్ 29 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. By Archana 09 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update Sikandar ka Muqaddar షేర్ చేయండి Tamannaah Bhatia: టాలీవుడ్ నటి తమన్నా భాటియా, జిమ్మీ షెర్గిల్, అవినాష్ తివారీ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'సికందక్ కా ముఖద్దర్'. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని 'ఎంఎస్ ధోని: ది అన్టోల్డ్ స్టోరీ' ఫేమ్ డైరెక్టర్ నీరజ్ పాండే తెరకెక్కించారు. శీతల్ భాటియా, నీరజ్ల నిర్మణ సంస్థ ఫ్రైడే ఫిల్మ్వర్క్స్ నిర్మించింది . Also Read: Pushpa2: 'పుష్ప2' ఐటమ్ సాంగ్ లీక్.. శ్రీలీల, బన్నీ లుక్ మామూలుగా లేదు! నేరుగా ఓటీటీలోనే విడుదల అయితే తాజాగా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. థియేటర్స్ లో కాకుండా నేరుగా ఓటీటీలోనే విడుదల చేసేందుకు నిర్ణయించారు. ఈ నెల 29 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. ''ముగ్గురు నిందితులు, కానీ దోషి ఎవరు? అసలు నిజం కేసులో బయటపడుతుంది.. 'సికందక్ కా ముఖద్దర్' చూడండి'' అంటూ రిలీజ్ డేట్ పోస్టర్ షేర్ చేశారు. ఈ సినిమా అంతా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగనుంది. రూ.60 కోట్ల విలువైన వజ్రాన్ని ఎలా దొంగతనం చేశారు? ఆ వజ్రాన్ని, దొంగలను పట్టుకోవడంలో పోలీసులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు..? 15 ఏళ్ళ పాటు కొనసాగిన ఈ కేసు చివరికి ఏమైంది..? అనే అంశాలతో సినిమా కథ ఉంటుంది. Also Read: మాటలకు కొత్త పుంతలు తొక్కించాడు.. టాలీవుడ్ మనసును గెలిచాడు.. మాటల మాంత్రికుడి బర్త్ డే స్పెషల్! Teen aaropi, lekin kaun apradhi? Case jald hi khulega. Watch Sikandar ka Muqaddar, out 29 November, only on Netflix!#SikandarKaMuqaddarOnNetflix pic.twitter.com/apoIyTTe8p — Netflix India (@NetflixIndia) November 7, 2024 Also Read: అందరికీ దూరంగా ఒంటరిగా.. అరుదైన వ్యాధితో బాధపడుతున్న అర్జున్ కపూర్! Also Read: సైలెంట్ గా ధనుష్ కొత్త మూవీ.. రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది..! #tollywood #crime thriller movie ott #Crime Thriller OTT మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి