అభినవ దానకర్ణుడు.. పేదల కోసం ఎన్ని కోట్లు ఇచ్చాడో తెలుసా? ఎడెల్‌గివ్ హురున్ ఇండియా 2024కి గాను దేశంలో అత్యధిక దాతల జాబితాను విడుదల చేసింది. ఇందులో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ రూ.2153 కోట్ల విరాళంతో టాప్ ప్లేస్‌లో ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో అజీమ్ ప్రేమ్ జీ, ముఖేష్ అంబానీ ఉన్నారు. By Kusuma 09 Nov 2024 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి ప్రతీ ఏడాది ఎడెల్‌గివ్ హురున్ ఇండియా.. దేశంలో అత్యధిక దాతల జాబితాను విడుదల చేస్తోంది. ప్రతీ ఏడాదిలానే ఎడెల్‌గివ్ హురున్ ఇండియా 2024 ఏడాదికి గాను అత్యధిక దాతల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. సుమారుగా రూ.2,153 కోట్ల విరాళాలను అందిస్తూ, దాతృత్వానికి మారుపేరుగా శివ నాడార్ నిలిచారు. మిగతా ప్రముఖ పారిశ్రామిక వేత్తలకు స్ఫూర్తిగా నిలిచారు. ఇది కూడా చూడండి: Amla: కార్తీక మాసంలో ఇంట్లో ఈ మొక్క నాటితే.. ఐశ్వర్య సిద్ధి తధ్యం! రెండేళ్ల కంటే 55 శాతం ఎక్కువ.. మొత్తం 203 మంది వ్యాపారవేత్తలు మొత్తం రూ. 8,783 కోట్లు విరాళంగా ఇచ్చారు. రెండేళ్ల క్రితం దానం చేసిన దాని కన్నా ఇది 55 శాతం ఎక్కువ. ఈ ఏడాదికి గానూ శివ్ నాడార్ టాప్‌లో ఉండగా.. తర్వాత స్థానాల్లో అజీమ్ ప్రేమ్‌జీ, ముఖేశ్ అంబానీ కంపెనీలు ఉన్నాయి. శివ్ నాడార్ ఇలా అత్యధికంగా దానం చేసి మూడోసారి టాప్ ప్లేస్ సంపాదించుకున్నారు. శివ్ నాడార్ ప్రతిరోజూ రూ.5.9 కోట్లు విరాళంగా ఇచ్చారు. మరి ఈ జాబితాలో టాప్10లో ఉన్నవారు ఎవరో చూద్దాం. శివ్ నాడార్హెచ్సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ నాడార్ మొత్తం రూ. 2,153 కోట్లు విరాళంగా ఇచ్చారు. శివ్ నాడార్ ఫౌండేషన్ పేరుతో నిరుపేద విద్యార్థులకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతోనే ఈ విరాళం ప్రకటించారు. అజీమ్ ప్రేమ్ జీవిద్య, ఆరోగ్య సంరక్షణ, గ్రామీణాభివృద్ధి కోసం అజీమ్ ప్రేమ్ జీ రూ. 1,000 కోట్లు విరాళం ఇచ్చారు. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ద్వారా గ్రామీణ విద్య, ఆరోగ్య సంరక్షణ సేవల అభివృద్ధి కోసం దానం చేశారు. ఇది కూడా చూడండి: Green Tea: ఉదయాన్నే గ్రీన్ టీ తాగేటప్పుడు ఈ మిస్టేక్స్ చేస్తున్నారా? ముఖేష్ అంబానీరిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆరోగ్య సంరక్షణ కోసం రూ. 800 కోట్లు విరాళంగా ఇచ్చారు. అలాగే గ్రామీణాభివృద్ధి, విద్య, క్రీడల అభివృద్ధి, విపత్తు నిర్వహణ, మహిళా సాధికారత, సాంస్కృతిక పరిరక్షణలో భాగంగా ఇచ్చారు. కుమార్ మంగళం బిర్లావిద్య, ఆరోగ్య సంరక్షణ కింద ఆదిత్య బిర్యా గ్రూప్ ద్వారా కుమార్ మంగళం బిర్లా రూ.700 కోట్లు విరాళం ఇచ్చారు. ఆసుపత్రులు, పాఠశాలల నిర్మించడానికి కుమార్ మంగళం బిర్లా డబ్బులు విరాళం ఇచ్చారు. అనిల్ అగర్వాల్అనేక సామాజిక, ఆర్థిక అభివృద్ధి ప్రాజెక్టులకు అనిల్ అగర్వాల్ కుటుంబం రూ.500 కోట్లు ఖర్చు చేశారు. ముఖ్యంగా విద్య, ఆరోగ్య సంరక్షణ కోసం డబ్బులు ఖర్చు పెట్టారు. అనిల్ అగర్వాల్ వేదాంత ఫౌండేషన్ ద్వారా విద్య, ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, గ్రామీణ ప్రాంతాల్లో ఆసుపత్రులకు విరాళంగా ఇచ్చారు. ఇది కూడా చూడండి: తొలి టీ20లో భారత్ విజయం.. అదరగొట్టిన శాంసన్ నందన్ నీలేకనిఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, నందన్ నీలేకని రూ.400 కోట్లు విరాళం ఇచ్చారు. దేశమంతటా విద్యను ప్రోత్సహించడానికి, అక్షరాస్యతను తగ్గించడానికి విరాళంగా ఇచ్చారు. రతన్ టాటాఆరోగ్య సంరక్షణ, విద్య కోసం టాటా ట్రస్ట్‌ల ద్వారా రతన్ టాటా రూ.350 కోట్లు విరాళంగా ఇచ్చారు. టాటా ట్రస్ట్‌ల ద్వారా ఆరోగ్య సంరక్షణ యాక్సెస్, విద్యా స్కాలర్‌షిప్‌లు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల కోసం ఇచ్చారు. సజ్జన్ జిందాల్జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్, సజ్జన్ జిందాల్ మారుమూల ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయడంతో సహా ఆరోగ్య సంరక్షణ, గ్రామీణాభివృద్ధికి రూ.300 కోట్లను విరాళంగా ప్రకటించారు. ఇది కూడా చూడండి: ఇక్కడ చేసిన ఫుడ్ తిన్నారో.. ఒక్కసారికే పైకి పోవడం గ్యారెంటీ! గౌతమ్ అదానీఅదానీ ఫౌండేషన్ ద్వారా గౌతమ్ అదానీ విద్య, పర్యావరణం అభివృద్ధి కోసం రూ.250 కోట్లు విరాళంగా ప్రకటించారు. బజాజ్ కుటుంబంఆరోగ్య సంరక్షణ, విద్యపై దృష్టి పెట్టడానికి రూ.200 కోట్లను బజాజ్ కుటుంబం విరాళంగా ఇచ్చింది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు చదువుకునేందుకు సాయం చేయడానికి దానం చేశారు. #philanthropy-2024 #india మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి