కారుకు గ్రాండ్‌గా అంత్యక్రియలు..నాలుగు లక్షల ఖర్చు..ఎక్కడో తెలుసా? మనుషులు చనిపోతే దహన చేయడమో, ఖననం చేయడమో మన అందరికీ తెలిసిందే. కొంతమంది పెంపుడు జంతువులకు కూడా చేస్తారు. కానీ కార్‌కు అంత్య్రియలు చేడం ఎక్కడైనా విన్నారా..గుజరాత్ లో ఓ ఫ్యామిలి వారికి ఇష్టమైన కారును సమాధి చేసి ఘనంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు. By Manogna alamuru 09 Nov 2024 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Car Funeral: మనుషుల తర్వాత ఘనంగా జంతువులకు అంత్యక్రియలు చేయడం ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం. ఇటీవల ఓ వ్యక్తి తన ఎద్దు చనిపోతే అంతిమ సంస్కారాలు చేశారు. ఇంకోచోట వానరం చనిపోతే కూడా అంత్యక్రియలు నిర్వహించడం చూశాం. ఇంక కుక్కలు, పిల్లు గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. కానీ వస్తువులకు ఎప్పుడైనా అంత్యక్రియలు చేయడం విన్నారా...అది కూడా కార్ లాంటి పెద్ద వస్తువులకు. మీరు చదువుతున్నది నిజమే. గుజరాత్‌లో ఓ కుటుంబం కార్‌కు అత్యంత ఘనంగా అంత్యక్రియలు నిర్వహింది. దీని కోసం నాలుగు లక్సలు కూడా ఖర్చు పెట్టింది. మొత్తం1500 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గుజరాత్‌కు చెందిన ఓ ఫ్యామిలీ 12 ఏళ్ళ క్రితం మారుతీ సుజుకీ వాగనార్ కారును ఇష్టంగా కొనుక్కున్నారు. వారింటికి అది వచ్చాక వాళ్ళకు బాగా లిసి కూడా వచ్చింది. అందుకే ఆ కార్‌ను వారు లక్కీ అని పిలుచుకుంటారు. అయితే లక్కీ సర్వీస్ అయిపోయింది. సరిగ్గా పని చేయడం మానేసింది. దాని కారణంగా ఆ కార్‌ను వారు వదులుకోలేకపోయారు. అమ్మేయడానికి కూడా మనసొప్పలేదు ఆ కుటుంబానికి. దీంతో కార్ ను సమాధి చేయాలని నిర్ణయించుకున్నారు. కార్యక్రమాన్ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు. కారును అందంగా అలంకరించారు. ఓ మనిషి చనిపోతే సమాధి చేసే ముందు ఎలా ముస్తాబు చేస్తారో అలా శుభ్రంగా కడిగి, రకరకాల పూలతో అలంకరించారు. కారును కొత్త బట్టతో చుట్టి చివరికి సమాధి చేశారు. అనంతరం చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలాంటి విచిత్రం ఎక్కడా చూడలేదంటూ జనాలు వీటిని తెగ షేర్ చేస్తున్నారు. Also Read: Breaking: ఎపీ అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ సస్పెండ్... Also Read: AP: బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీలో మూడు రోజుల పాటూ వర్షాలు Also Read: AP cabinet: నవంబర్ 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. Also Read: మోదీకి రేవంత్ వార్నింగ్.. మహారాష్ట్ర ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి