శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు వెళ్ళడానికి అల్లు అర్జున్ ను ముందు రావొద్దని అన్నారు...తరువాత షరతులతో కూడిన అనుమతినిచ్చారు. మొత్తానికి సంధ్యా థియేటర్ తొక్కిసలాట సంఘటన తర్వాత ఇన్ని రోజులకు శ్రీతేజ్‌ను చూడ్డానికి అల్లు అర్జున్ వెళుతున్నారు. సంఘటన జరిగిన దగ్గరి నుంచి అల్లు అర్జున్ కేసుతో సతమతమయ్యారు. అరెస్ట్ యఇ జైలుకు వెళ్ళారు. ఆ తరువాత బెయిల్ మీద బయటకు వచ్చిన ఆ టెన్షన్ టెన్షన్గా గడిపారు చాలా రోజులు. వారం రోజుల క్రితం అతనికి షరతులతో కూడిన బెయిల్‌ను ఇచ్చారు. ఇప్పుడు పరిస్థితులు కూడా కాస్త కుదుట పడ్డాయి. దీంతో ఇప్పుడు శ్రీతేజ్‌ను చూడ్డానికి నిర్ణయించుకున్నారు అల్లు అర్జున్. ముందు వద్దన్నారు...తరువాత షరతులతో అనుమతి.. పుష్ప ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్‌గా దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే ఆమె చనిపగా...ఆమె కొడుకు శ్రీతేజ్ విపరీతంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి అతను బేగంపేట్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇన్నాళ్ళు అతని కండిషన్ సీరియస్‌గా ఉంది. వేంటిలేటర్ మీదనే ఉన్నాడు. తాజాగా అని ఆరోగ్యం కాస్త కుదుటపడింది. కళ్ళు తెరిచి చూస్తున్నాడని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ శ్రీతేజ్‌ను చడ్డానికి వెళుతున్నారు. దానికి తోడు సంఘటన జరిగిన వెంటనే అతన్ని చూడ్డానికి వెళితే మ్ళీ పరిస్థితులు ప్రమాదకరంగా మారేవి. అది దృష్టిలో ఉంచుకుని కూడా శ్రీతేజ్‌ను చూడ్డానికి బన్నీకి అనుమతినివ్వలేదు. ఇప్పుడు కూడా అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి రావడానికి పోలీసులు ముందు అనుమతి ఇవ్వలేదు. రావొద్దని నోటీసులు ఇచ్చారు. అయితే తరువాత అతన్ని చూడ్డానికి రహస్యంగా వెళ్ళాలని...షరతులతో కూడిన అనుమతినిచ్చారు రాంగోలపేట పోలీసులు. అల్‌ల అర్జున్ తాను వస్తున్న విషయం ముందుగా చెబితే...దానికి తగ్గట్టు చర్యలు తీసుకుంటామని అన్నారు. బెయిల్ షరతులు ఉల్లంఘించకుండా ఉండాలని కోరిన పోలీసులు, పరామర్శకు వచ్చినప్పటికీ తమ సూచనలు పాటించాల్సిందేనని చెప్పారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే, దాని బాధ్యత అల్లు అర్జున్‌పై ఉండవచ్చని హెచ్చరించారు. అలాగే ఆసుపత్రికి రాకను గోప్యంగా ఉంచాలని పోలీసులు సూచించారు. ఇది కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇతర రోగులు, వారి తల్లిదండ్రులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండటానికి అవసరమని తెలిపారు. దీనికి తోడు అల్లు అర్జున్ ఆసుపత్రికి వచ్చిన సమయంలో ఫుల్ ప్రొటెక్షన్ అందిస్తామని పోలీసులు చెప్పారు. Also Read: Chhattisgarh: జర్నలిస్ట్ ముకేశ్ హత్య కేసులో వెలుగులోకి భయానక విషయాలు..