/rtv/media/media_files/2025/12/20/china-water-bomb-2025-12-20-18-45-50.jpg)
చైనా ఇంజనీరింగ్ అద్భుతం అని పిలిచే త్రీగోర్జెస్ ఆనకట్ట ఇప్పుడు భారత్ ను భయపెడుతోంది. యార్లుంగ్త్సాంగపోపై చైనా నిర్మిస్తున్న ఈ ఆనకట్ట చుట్టూ పారదర్శకత లేదని ఆరోపిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆనకట్టగా మారనున్న ఈ త్రీగోర్జెస్ జాతీయ భద్రతను పెంచడమే లక్ష్యంగా నిర్మిస్తున్నామని చైనా అధ్యక్షుడు జెన్ పింగ్ చెప్పారు. ఇది వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి ఇటీవలి ఉద్రిక్తతల మధ్య బీజింగ్ ఇంధన సరఫరాను పెంచడమే కాకుండా భారత సరిహద్దులో నియంత్రణను కఠినతరం చేయాలనే లక్ష్యంతో దీని నిర్మాణం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద జలవిద్యుత్ కేంద్రంగా నిర్మితమౌతున్న డ్యామ్ త్రీగోర్జెస్.
చైనా కావాలనే చేస్తోంది..
దీనిని చైనా వ్యూహాత్మకంగా నిర్మిస్తోందని న్యూఢిల్లీకి చెందిన ఆసియా సొసైటీ పాలసీ ఇన్స్టిట్యూట్ అసిస్టెంట్ డైరెక్టర్ రిషి గుప్తా చెబుతున్నారు. హిమాలయాలలో, ముఖ్యంగా టిబెట్ వెంట చైనా సరిహద్దులో ఉన్న ప్రాంతాలలో చైనా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇది దోహదపడుతుందని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా, టిబెట్ వంటి కీలక ప్రాంతాలపై నియంత్రణను ఏకీకృతం చేయడానికి సహజ వనరులను ఉపయోగించుకునే విస్తృత లక్ష్యాన్ని సాధించడానికి చైనా ప్రయత్నిస్తుందని తెలిపారు. భారత్ చైనా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును నిశితంగా గమనిస్తోందని చెబుతున్నారు. భారత్ కు ఇది ఆందోళన కలిగించే అంశంగా మారిందని రిషి గుప్తా అంటున్నారు. ఎందుకంటే దీనిని టిబెట్‌లోనియార్లుంగ్త్సాంగ్పో నది దిగువ ప్రాంతాలలో నిర్మిస్తున్నారు. ఇది భారత్, బంగ్లాదేశ్ లోని బ్రహ్మపుత్రగా మారి దిగువకు ప్రవహిస్తుంది. ఇప్పుడు చైనా దీనిపై ఆనకట్ట కట్టడం వలన భారత్ లో ప్రవాహాలను 85 శాతం వరకు తగ్గిస్తుందని భయం ఉందని చెబుతున్నారు. ఈ డ్యామ్ పూర్తిగా పనిచేయడం మొదలైతే, బ్రహ్మపుత్రలో నీరు ఎప్పుడు రావాలి, ఎంత రావాలి అన్నది బీజింగ్ నిర్ణయించే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కసారిగా నీరు వదిలితే అస్సాం, అరుణాచల్ లోయలు వరదల్లో మునిగిపోతాయి. ఒకవేళ నీరు ఆపితే నది ఎండిపోయే ప్రమాదం ఉంటుంది.
టిబెట్ తో లింక్..
ఇది కేవలం పర్యావరణ సమస్యే కాదు.. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కూడా. భారత్-చైనా మధ్య ఇప్పటికే సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఇప్పుడు అదే పోరు నదుల వరకు చేరుతోందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఒక నదిని చైనా తన ఆయుధంగా మార్చుకుంటోంది. నిజానికి బ్రహ్మపుత్ర నది టిబెట్‌లో మొదలవుతుంది. అక్కడ ఈ నదిని యార్లుంగ్ సాంగ్పో అని పిలుస్తారు. హిమాలయాల మధ్య జన్మించిన ఈ నది, భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలకు జీవనరేఖగా మారుతుంది.
బ్రహ్మపుత్రపై భారత్ ఆనకట్ట..
చైనా అతి పెద్ద జల విద్యుత్ వ్యవస్థను అభివృద్ధి చేయడం అభినందనీయమే అయినప్పటికీ...అది కడుతున్న ప్రదేశంపైనే చాలా భయాలు నెలకొన్నాయి. అది భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతంలో ఉంది. అలాంటి చోట ఒక చిన్న డిజైన్ లోపం, ఒక తప్పు అంచనా, ఒక ప్రకృతి విపత్తు జరిగితే దాని ప్రభావం నేరుగా దిగువ ప్రాంతాలపై పడుతుంది. నది నియంత్రణ తప్పితే, అది దేశాల సరిహద్దును దాటుతుంది. అందుకే భారత్ టెన్షన్ పడుతుంది. దాంతో పాటూ దీని వలన దిగువ ప్రాంతంలో చేపలు పట్టడం, వ్యవసాయం లాంటివి విపరీతంగా ప్రభావితం అవుతాయని చెబుతున్నారు. అందుకే ఈశాన్య రాష్ట్రాలు దీనిని వాటర్ బాంబ్ అని పిలుస్తున్నాయని అంటున్నారు. భారత్ లో బ్రహ్మాపుత్రా నదిని చైనా తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉండగా, చైనా ప్రాజెక్టును ఎదుర్కోవడానికి భారతదేశం కూడా నదికి తన వైపున ఒక ఆనకట్ట నిర్మించాలని యోచిస్తోంది. బ్రహ్మపుత్ర బేసిన్ అంతటా అదే నదిపై కనీసం 208 జలవిద్యుత్ ప్రాజెక్టులను ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. ప్రభుత్వ మద్దతుగల జలవిద్యుత్ సంస్థ నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC) అదే నదిపై 11,200 మెగావాట్ల ఆనకట్టను నిర్మించడానికి ప్రణాళికలు వేస్తోంది.
Follow Us