Trump- Iran: ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర! అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ను హత్య చేసేందుకు ఇరాన్ కుట్ర పన్నిందనే ఆరోపణలను ఇరాన్ ఖండించింది. ఈ ఆరోపణలు ఇరుదేశాల మధ్య సంబంధాలను క్లిష్టతరంగా చేసేవిగా వెల్లడించింది. By Bhavana 10 Nov 2024 in ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి America: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ను హత్య చేసేందుకు ఇరాన్ కుట్ర పన్నిందని...దాన్ని ఎఫ్‌బీఐ అధికారులు భగ్నం చేశారని అమెరికా న్యాయ విభాగం పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. Also Read: New Train Route: ఏపీలో ఈ రూట్‌లో కొత్త ట్రైన్ మార్గం..! ఇవి ఇరుదేశాల మధ్య సంబంధాలను క్లిష్టతరంగా చేసేవిగా వెల్లడించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాకీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. మా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారానికి హాజరైన సమయంలో హమాస్ చీఫ్ హనియే హత్య గుర్తుందా? అది ఎవరు, ఎందుకు చేశారో అందరికీ తెలుసు. Also Read: TCS: ఆఫీసుకొస్తేనే బొనస్ ఇస్తానంటున్న టీసీఎస్! ఇప్పుడు అమెరికాలో ఎన్నికలు జరగగానే...మరో లక్ష్యాన్ని రూపొందించారు. హంతకుడు ఇరాన్ లో కూర్చుని ఎఫ్‌బీఐతో ఆన్ లైన్ లో మాట్లాడుతున్నారనేదాన్ని ఎవరు నమ్ముతారు? అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ప్రజలు తమ నిర్ణయం తీసుకున్నారు. Also Read: Vizag: విశాఖలో ఫైవ్ స్టార్ హోటల్ కూల్చివేత.. వారి నిర్ణయాన్ని ఇరాన్ గౌరవిస్తుంది. రెండు వైపుల నుంచి విశ్వాసాన్ని పెంపొందించుకోవడం అవసరం అని అరాకీ పేర్కొన్నారు. మరోపక్క ట్రంప్ హత్య కుట్రలో ఇరాన్ ప్రమేయాన్ని విదేశాంగ ప్రతినిధి ఎస్మాయిల్ బఘై సైతం ఖండించారు. అమెరికా న్యాయశాఖ నివేదిక పూర్తి నిరాధారమైనదిగా అభివర్ణించారు.గతంలోనే తమ పై ఇలాంటి ఆరోపణలు చేశారని, వాటిని సైతం తాము తీవ్రంగా ఖండించామన్నారు. ఇరు దేశాల మధ్య సమస్యలను మరింత క్లిష్టతరం చేయడానికి జియోనిస్ట్ , తమ వ్యతిరేక వర్గాలు ఈ రకమైన కుట్రలు రూపొందిస్తున్నారన్నారు. Also Read: మంచి మనసు చాటుకున్న ట్రంప్.. కమలా పార్టీకి విరాళాలివ్వాలని పిలుపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ ను హత్య చేసేందుకు ఇరాన్ కుట్ర పన్నిందని..దాన్ని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు భగ్నం చేశారని అమెరికా న్యా విభాగం తెలిపింది. ఈ మేరకు మన్‌హట్టన్ లోని ఫెడరల్ కోర్టులో అభియోగాలను నమోదు చేసింది. ఇందులో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ దళానికి చెందిన ఓ గుర్తు తెలియని అధికారిని కూడా జస్టిస్ డిపార్ట్‌మెంట్ చేర్చింది. ఈ కుట్రంలో పాల్గొన్న మరో వ్యక్తి పేరును ఫర్జాద్ షకేరిగా పేర్కొంది. ఇరాన్ లో ఉంటున్న షకేరీ అమెరికాలో తనకు తెలిసిన ఇద్దరు వ్యక్తులను ఈ హత్య ప్రణాళికను అమలు చేసేందుకు ఎంపిక చేసుకున్నాడని ఎఫ్‌బీఐ పేర్కొంది. వారిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే ఎన్నికల ప్రచారం సందర్భంగానే ట్రంప్ ను హత్య చేయాలని తమకు సూచనలు అందాయని, తర్వాత ప్రణాళిక మారిందని షకేరీ తెలిపినట్లు ఎఫ్‌బీఐ తెలిపింది. #international-news #donald-trump #iran #Abbas Araqchi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి