Water Bomb: చైనా డ్యామ్..భారత్ పై వాటర్ బాంబ్..అరుణాచల్ సీఎం ఆందోళన

అరుణాచల్ ప్రదేశ్ రిహద్దుల్లో చైనా నిర్మిస్తున్న మెగా డ్యాటమ్ ఓ వటర్ బాంబ్ అని మరసారి ఆందోళన వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర సీఎం పెమా ఖండూ. ఇది అస్తిత్వ ముప్పు, సైనిక ముప్పు మాత్రమే కాకుండా మరేదైనా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని అన్నారు. 

New Update
water bomb

Arunachal CM Pema Khandu

చైనాను అస్సలు నమ్మలేం. వారు ఎప్పుడు ఏం చేస్తారో అస్సలు తెలియదు అని వ్యాఖ్యానించారు అరుణాచల్ సీఎం పెమా ఖండూ. భారత్ సరిహద్దుల్లో చైనా నిర్మిస్తున్న వాటర్ డ్యామ్ పై ఆయన మరోసారి స్పందించారు. ఇప్పటికే ఆ డ్యామ్ గురించి సరిహద్దు రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. పెమా ఖండూ కూడా పదే పదే దీని గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా తలపెట్టిన భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు భారత్ పై వాటర్ బాంబ్ కానుందని పెమా అన్నారు. దీనికి సంబంధించి చనా, భారత్ తో ఏదైనా ఒప్పందం చేుకుంటే పర్వాలేదు కానీ..లేకపోతే మాత్రం కష్టం అని అంటున్నారు. ఒప్పందం అయితే ఈ ప్రాజెక్టు ఒక వరం. అరుణాచల్ ప్రదేశ్‌, అస్సాం, బంగ్లాదేశ్‌లో వేసవి వరదలను నిరోధించే అవకాశం ఉంటుంది. కానీ మనం లేదా చైనా అటువంటి సంతకాలు చేసుకోలేదు. 

ఇదో పెద్ద వాటర్ బాంబ్..భారత్ కు ముప్పు..

ఇప్పుడు చైనా ప్రాజెక్టు కనుక సిద్ధం అయితే వారు ఒక్కసారిగా నీటిని విడుదల చేయవచ్చును అప్పుడు అరుణాచల్ లోని సియాంగ్ ప్రాతమంతా మునిగిపోతుంది. దాంతో పాటూ మన సియాంగ్‌, బ్రహ్మపుత్ర నదులు ఎండిపోవచ్చు. అసలు ఆ దేశం ఈ ప్రాజెక్టు గురించి ఎలాంటి సమాచారం పంచుకోవడం లేదు అని సీఎం పెమా ఖండూ ఆందోళన వ్యక్తం చేశారు. భారత చైనాల మధ్య కుదిరిన ఒక ఒప్పందం ప్రకారం ఎగువనున్న చైనా బ్రహ్మపుత్ర జలసంబంధ (హైడ్రలాజికల్‌) సమాచారాన్ని దిగువనున్న భారత్‌తో పంచుకోవాల్సి ఉంది. కానీ చైనా మాత్రం ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి సమాచారాన్ని భారత్ తో పంచుకోవడం లేదు. 

అతిపెద్ద జలవిద్యుత్ డ్యామ్‌ను నిర్మించేందుకు చైనా శ్రీకారం చుట్టింది. త్రీగోర్జెస్‌ డ్యామ్‌ కంటే మూడు రెట్లు ఎక్కువగా ఈ డ్యామ్‌ను నిర్మించేందుకు అక్కడి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారత్‌ సరిహద్దుకు సమీపంలోని టిబెట్ ప్రాంతంలో ఈ డ్యామ్‌ను నిర్మించనుంది. మొత్తం 137 బిలియన్ డాలర్ల వ్యయంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్‌ఫ్రా ప్రాజెక్టుగా ఈ డ్యామ్‌ నిలుస్తుందని అక్కడి అధికారులు చెబుతున్నారు. హిమాలయాల్లోని బ్రహ్మపుత్ర నది యూటర్న్ అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం గుండా బంగ్లాదేశ్‌లోకి ప్రవహిస్తుంది. సరిగ్గా ఆ యూటర్న్ ఉన్న చోటనే చైనా ఈ డ్యామ్ను నిర్మిస్తోంది. బ్రహ్మపుత్రా నదీ జలాల ప్రవాహం, పంపిణీకి సంబంధించిన వివిధ అంశాలపై భారత్-చైనా మధ్య ఒప్పందం జరిగింది. వర్షాకాలంలో ఈ నదికి ఎక్కువగా వరదలు వస్తుంటాయి. ఇరుదేశాల మధ్య ఒప్పంద ప్రకారం మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు బ్రహ్మపుత్ర నీటిని రెండు దేశాలు పంచుకోవాల్సి ఉంది.

అయితే చైనాలో ఉన్న త్రీ గోర్జెస్ డ్యామ్‌ ప్రపంచంలోనే అతిపెద్దది. ఈ డ్యామ్‌ వల్ల మానవాళికి ప్రమాదం పొంచి ఉందని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తుండటం కలకలం రేపుతోంది. దీనివల్ల భూ గమనంలో మార్పులు జరుగుతున్నాయని.. ఇది ఏ మాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని యాంగ్జీ నదిపై దాదాపు 2.33 కిలోమీటర్ల పొడవు, 181 మీటర్ల ఎత్తులో త్రీగోర్జెస్‌ డ్యామ్‌ను నిర్మించారు. అయితే ఇది అందుబాటులోకి వచ్చాక యాంగ్జి నదిలో పెద్ద మొత్తంలో నీరు నీల్వ ఉండటం వల్ల భూ పరిభ్రమణ వేగం 0.06 మైక్రో సెకండ్ల వరకు తగ్గిపోయిందని అప్పట్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే సూర్యుడి నుంచి భూమి దురం కూడా 2 సెంటిమీటర్ల వరకు దూరం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ డ్యామ్‌ ప్రభావం ఇంకా పెరుగుతోందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు