Supreme Court: నీళ్ళు, ఇళ్ళు లేక చాలా మంది ఉంటే..మీకు సైకిల్ ట్రాక్ కావాలా..సుప్రీంకోర్టు ఆగ్రహం

దేశ వ్యాప్తంగా సైకిళ్ళ కోసం ప్రత్యేక ట్రాక్ లు ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు అయింది. దీనిపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో పేద ప్రజలకు తాగు నీరు, గూడు లేక బాధలు పడుతుంటే..సైకిల్ ట్రాక్ లు కావాలా అంటూ ప్రశ్నించింది. 

New Update
Supreme Court

Supreme Court

మురికి వాడల్లో ఉండే ప్రజలకు కనీసం ఉండేందుకు ఇళ్లు లేవని.. తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకట్లేదు...మీకు మాత్రం సైకిల్ ట్రాక్ లు కావాలా అని సుప్రీంకోర్టు మండిపడింది. భారతదేశ వ్యాప్తంగా సైకిల్ ట్రాక్ లు ఏర్పాటు చేయాలంటూ దాకలు అయిన పిటిషన్ మీద విచారణలో ఈ వ్యాఖ్యలను చేసింది. సైక్లింగ్ ప్రమోటర్ దేవిందర్ సింగ్ నాగి ఇటీవలే సుప్రీం కోర్టులో.. దేశ వ్యాప్తంగా సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలంటూ ఓ పిటిషన్ వేశారు. అనేక రాష్ట్రాల్లో రోడ్లపై రైళ్ల కోసం ప్రత్యేక ట్రాక్‌లు ఉన్నాయని.. దేశ వ్యాప్తంగా ఈ సౌకర్యాన్ని కల్పించాలంటూ పిటిషన్‌లో కోరారు. 

Also Read :  బొక్క బోర్లా పడుతుందా.. కేజ్రీవాల్ చేసిన తప్పే చేస్తానంటున్న మమతా బెనర్జీ!

పగటి కలలు కనకండి..

దేశంలోని రాష్ట్రాల దగ్గర ఉన్న ప్రజలందరికీ ఇళ్ళు నిర్మించి ఇచ్చేందుకు డబ్బులు లేవు. ప్రజలకు మంచినీళ్ళకు సరిపడా ఇవ్వలేకపోతున్నారు. ప్రభుత్వాలు నానాతంటాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పైకిల్ ట్రాక్ లు కావాలని పగటి కలలు కంటున్నారా అంటూ న్యాయస్థానం పిటిషనర్ ను ప్రశ్నించింది. ఒకసారి దేశమంతా తిరిగి చూడాలని, మురికి వాడలను దర్శించాలని...వారికి కనీసం సౌకర్యాలు ఉన్నాయో లేవో చూడాలని సూచించారు. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో...దేనికి ఇవ్వకూడదో తెలుసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది.  

Also Read: Business: అల్యూమినియం దిగుమతులపై సుంకం..లక్షల కోట్ల సంపద ఆవిరి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు