Pakistan: పాకిస్థాన్‌లో ఆత్మహుతి దాడి.. 16 మంది సైనికులు మృతి

పాకిస్థాన్‌కు మరో బిగ్ షాక్‌ తగిలింది. తాలిబన్ హఫీజ్‌ గుల్‌ బహదూర్ గ్రూప్‌ ఆత్మహుతి దాడికి పాల్పడింది. ఈ దాడిలో 16 మంది పాక్‌ సైనికులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఆ దేశ సైనికాధికారులు అధికారికంగా ప్రకటించారు.

New Update
Suicide attack kills 16 soldiers in Pakistan

Suicide attack kills 16 soldiers in Pakistan

పాకిస్థాన్‌కు మరో బిగ్ షాక్‌ తగిలింది. తాలిబన్ హఫీజ్‌ గుల్‌ బహదూర్ గ్రూప్‌ ఆత్మహుతి దాడికి పాల్పడింది. ఈ దాడిలో 16 మంది పాక్‌ సైనికులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఆ దేశ సైనికాధికారులు అధికారికంగా ప్రకటించారు. అలాగే ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు, పౌరులతో సహా మొత్తం 24 మందికి గాయాలయ్యాయని తెలిపారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. ఉగ్రవాది పేలుడు పదార్థాలు ఉన్న వాహనంతో సైనిక కాన్వాయ్‌పై దూసుకెళ్లినట్లు పేర్కొన్నారు.

Also Read: నా కొడుకు వీర్యాన్ని అప్పగించండి.. కోర్టులో తల్లి వింత పిటిషన్

వాహనంలో భారీ పేలుడు జరగడంతో 13 మంది పాక్‌ సైనికులు అక్కడికక్కడే మృతి చెందారు. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరో ముగ్గురు సైనికులు మ-ృతి చెందారు. ఈ పేలుడు ధాటికి రెండు ఇళ్ల పైకప్పులు కూలిపోయాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు పిల్లలు గాయాలపాలైనట్లు పేర్కొన్నారు. అయితే పాక్‌కు చెందిన తాలిబన్ హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్‌ ఈ పేలుడు ఘటనకు బాధ్యత వహించింది. 

Also Read: ఇజ్రాయిల్ ప్రధాని ప్లాన్ ఇదే.. యుద్ధాలతో ప్రజల్ని మార్చుతున్న నెతన్యాహు

ఇదిలాఉండగా పాకిస్థాన్‌పై బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ కూడా దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. బలూచిస్థాన్‌ను ప్రత్యేక దేశం చేయాలని కోరుతూ అక్కడ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ఓ రైలును కూడా బీఎల్ఏ మిలిటెంట్లు హైజాక్‌ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 400 మందికి పైగా ప్రయాణికులను బందీలుగా తీసుకెళ్లారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన పాక్‌ ఆర్మీ వాళ్లను విడిపించింది.  

Advertisment
తాజా కథనాలు