USA-India: ఏప్రిల్ 2 నుంచి భారత్ పై ప్రతీకార సుంకాలు..సపోర్ట్ చేసిన జైశంకర్

ఇండియాపై ప్రతీకార సుంకాలు తప్పవని.. ఏప్రిల్ 2 నుంచి అమలు అవుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేల్చి చెప్పేశారు. అయితే దీనిపై స్పందించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్..వాణిజ్య ఒప్పందం ఆవశ్యకతపై ఇరు దేశాలు పరస్పర అంగీకారానికి వచ్చాయని అన్నారు. 

author-image
By Manogna alamuru
New Update
tariff

Jai shankar, Trump

అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక నిన్న అధ్యక్షుడు ట్రంప్ మొదటిసారి యూఎస్ కాంగ్రెస్ లో ప్రసంగించారు. ఇందులో తాను వచ్చాక తీసుకున్న నిర్ణయాలు, పెట్టిన సంతకాల గురించి వివరించారు. దాంతో పాటూ సుంకాల గురించి కూడా ప్రస్తావించారు. శత్రు దేశాలే కాక మిత్ర దేశాలు సైతం అమెరికాపై అన్యాయంగా సుంకాలు విధిస్తున్నాయని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  పలు దేశాలు కొన్ని దశాబ్దాలుగా తమ దేశంపై అత్యధిక సుంకాలు విధిస్తున్నాయని చెప్పారు. ఇప్పుడు అమెరికా వంతు వచ్చిందని..ప్రతీకార సుంకాలు విధించాల్సిందేనని అన్నారు.  భారతదేశం మన ఆటో ఉత్పత్తులపై 100 శాతం కన్నా ఎక్కువ సుంకాలు వేస్తోంది. ఇది మనం వారిపై విధిస్తున్న దానికన్నా రెట్టింపు ఉందని చెప్పారు. దక్షిణ కొరియా సుంకాలైతే ఏకంగా నాలుగు రెట్లు అధికంగా ఉంటున్నాయి. కానీ ఇప్పటివరకు అమెరికా వారందరితోనూ మంచిగానే ఉంటూ వచ్చింది.  మనల్ని దోచుకుని తింటున్నా చూస్తూ ఊరుకున్నాం. ఇక మీదట అలా జరగనిచ్చేది లేదని ట్రంప్ ఢంకా బజాయించారు. ఇతర దేశాలు మాపై ఏ స్థాయిలో సుంకాలు విధిస్తే.. తామూ అలాగే విధిస్తాం. వారు మనల్ని తమ మార్కెట్లకు దూరంగా ఉంచే ఉద్దేశంతో నాన్‌-మానెటరీ టారిఫ్స్‌ విధిస్తే..అమెరికా కూడా వారిని మన మార్కెట్లకు దూరంగా ఉంచడానికి అలాగే చేస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. 

సమాన అధికారాల కోసమే...

ట్రంప సుంకాల విధింపుపై తాజాగా భారత విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందించారు. లండన్ పర్యటనలో ప్రపంచంలో భారతదేశ వృద్ధి.. పాత్ర అనే అంశంపై మాట్లాడుతూ సుంకాల గురించి ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అమెరికా, భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఆవశ్యకతపై పరస్పరం అంగీకారానికి వచ్చినట్లు జైశంకర్ తెలిపారు.  ప్రపంచంలో శక్తివంతమైన దేశాలన్నింటికీ సమాన అధికారాలు ఉండాలన్న ఆలోచనతోనే ట్రంప్ ఇదంతా చేస్తున్నారని వెనకేసుకొచ్చారు. ఇండియా కూడా సరిగ్గా ఆలోచిస్తుందని అన్నారు. క్వాడ్‌లో ప్రతి దేశం తమవంతు పాత్ర పోషిస్తోంది. అందులో ఫ్రీ రైడర్లు ఎవరూ లేరు అంటూ జైశంకర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అమెరికా పర్యటనలో ఉన్నారని..సుంకాలు, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై చర్చిస్తున్నారని తెలిపారు. సుంకాల ఒప్పందంపై ఇరు దేశాలు పరస్పర అంగీకారానికి వచ్చాయని చెప్పారు.

Also Read: Mumbai: ట్విన్ టన్నెల్ పిటిషన్ పై రోజంతా వాదనలు..పిల్ ను రిజర్వ్ చేసిన బాంబే హైకోర్ట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు