/rtv/media/media_files/2025/03/01/qHzfKzgGxWYU0XVtInYi.jpg)
trump Photograph: (trump )
Trump Vs Zelenskyy: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ మధ్య మాటలతూటాలు పేలాయి. ఇరువురి మధ్య గంటసేపు సాగిన భేటీలో చివరి 10 నిమిషాలు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయగా బెదిరింపులకు భయపడేది లేదని జెలెన్‌స్కీ తేల్చిచెప్పారు. వీడియో వైరల్ అవుతోంది.
Watch this carefully. Very important.
— Elon Musk (@elonmusk) February 28, 2025
pic.twitter.com/wdM3XdbrH1
మీ దారి మీరు చూసుకోండి..
ఈ మేరకు రష్యా దాడులను అరికట్టాలని, ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదుర్చాలంటూ జెలెన్ స్కీ శుక్రవారం అమెరికా మద్ధతు కోసం వైట్ హౌస్ వచ్చారు. అయితే ఇందుకు బదులుగా ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని ట్రంప్ కోరారు. దానికి జెలెన్ స్కీ అంగీకరించకపోవడంతో 'మాతో ఒప్పందం కుదుర్చుకుంటే మంచిది.. లేదంటే మీ దారి మీరు చూసుకోండి' అని ట్రంప్ అన్నారు. దీంతో భవిష్యత్తులో తమపై రష్యా దాడులకు పాల్పడితే రక్షణ కల్పించాలని జెలెన్ స్కీ బలంగా అడిగారు. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన ట్రంప్.. ఇన్నాళ్లుగా సాయపడుతూ వస్తున్న దేశంతో మాట్లాడే పద్ధతి ఇది కాదన్నారు. ఇది అవమానకరంగా ఉందంటూ జెలెన్ స్కీపై మండిపడ్డారు.
మూడో ప్రపంచయుద్దమే..
‘మీరు నిజంగా ధైర్యవంతులు. అయినా మాతో ఒప్పందం కుదుర్చుకోండి. లేదంటే మాతో స్నేహం వదిలేయండి. అప్పుడు మీరొక్కరే పోరాటం చేయాలి. మీకు మరో మార్గం లేదు. మాతో ఒప్పందానికి ఇది సరైన పద్ధతి కాదు. కృతజ్ఞత లేకుండా, అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు. డిమాండ్ చేసే పరిస్థితుల్లో మీరు లేరనే విషయాన్ని గుర్తించాలి' అటూ జెలెన్‌స్కీ వైపు వేలెత్తి చూపిస్తూ ఫైర్ అయ్యారు. అంతేకాదు లక్షల మంది ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చని హెచ్చరించారు.
Also Read: హిందూ అమ్మాయితో పెళ్లి.. ముస్లిం వ్యక్తిని చితకబాదిన లాయర్లు!
అయితే ఇరు దేశాల మధ్య చర్చలు విఫలం కావడంతో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే జెలెన్‌స్కీ బయటకు వచ్చేశారు. విందూ కూడా రద్దు అయింది. నిజానికి ఇద్దరూ సంతకాలు చేసిన తర్వాతే విలేకరుల సమావేశంలో మాట్లాడాల్సి ఉంది. కానీ శాంతియుత దౌత్య చర్చలకు వేదికగా నిలిచే ఓవల్ కార్యాలయంలో ఇలాంటి పరిణామం చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది.
Also Read: తాగొచ్చి కొట్టేవాడు...ఇంటినుంచి గెంటేశాడు.. మానవ్ శర్మ భార్య సంచలన కామెంట్స్