/rtv/media/media_files/2025/04/20/pXYEDYVj9CdWq77bxWKI.jpg)
kheal das kohistani
పాకిస్థాన్‌లోని సింధ్ ప్రాంతానికి చెందిన ముస్లిం లీగ్‌నవాజ్ శాసనసభ్యుడు, మత వ్యవహారాల సహాయ మంత్రి ఖేల్ దాస్ కోహిస్తానీపై దాడి జరగడం సంచలనం రేపింది. దీనిపై పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సైతం స్పందించారు. ప్రజాప్రతినిధులపై దాడులు చేయడం ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు. దీనిపై దర్యాప్తు చేసి కఠినంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Also Read: ట్రంప్‌ను తిడుతూ.. వలసదారులకు స్వాగతం అంటున్న అమెరికన్ పౌరులు
మరోవైపు దీనిపై తాను కోహిస్తానీతో ఫోన్‌లో మాట్లాడానని చెప్పారు. సింధ్ సీఎం సయ్యద్ మురాద్ అలీ షా కూడా ఈ చర్యను ఖండించారు. ఎవరికీ కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు లేదన్నారు. దాడికి పాల్పడ్డ దుండగులను అరెస్టు చేసి రిపోర్ట్ సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అసలేం జరిగిందంటే.. సింధ్ రాష్ట్రంలో నిర్మించనున్న నూతన కాలువలకు కోహిస్తానీ ప్రణాళికను రూపొందించారు.
Also Read: సీఎంకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ షాక్.. మర్యాదగా మాట్లాడలేనంటూ ఒమర్ అబ్దుల్లా ఫైర్!
కానీ ఈ ప్లాన్ వల్ల తమకు నష్టం కలుగుతుందని కొందరు ఆయనకు వ్యతిరేకంగా నిరసన చేశారు. ఈ క్రమంలోనే శనివారం కోహిస్తానీ.. సింధ్‌లో తట్టా జిల్లా వైపు వెళ్తుండగా.. నిరసనకారులు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించారు. కర్రలు, టమోటాలు, బంగాళదుంపలతో దాడులు చేశారు. ఈ దాడిలో కోహిస్తానీకి గాయాలు కాలేవని అధికారులు తెలిపారు.
Also Read: తెలంగాణ రేషన్ షాపుల్లో ప్లాస్టిక్ రైస్ పంపిణీ? ఉడికించి వీడియో పోస్ట్ చేసిన లబ్దిదారుడు!
Also Read: ‘టీం శివంగి’.. రాష్ట్రంలో తొలిసారి రంగంలోకి మహిళా కమాండోల బృందం!
telugu-news | rtv-news | pakistan