Jofra Archer: రూ.12 కోట్లు బొక్క.. ఇదేం బౌలింగ్రా అయ్యా.. జోఫ్రా ఆర్చరీ పరమ చెత్త రికార్డు!

రాజస్థాన్ రాయల్స్ బౌలర్ జోఫ్రా ఆర్చరీ పరమ చెత్త రికార్డు నెలకొల్పాడు. వేసిన నాలుగు ఓవర్లలో ఏకంగా 76 పరుగులు ఇచ్చాడు.  ఐపీఎల్ చరిత్రలోనే ఏ బౌలర్ కూడా ఇన్ని పరుగులు ఇవ్వలేదు. జోఫ్రా ఆర్చర్‌ను  రాజస్థాన్ రాయల్స్ ఏకంగా రూ. 12 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.

New Update
Jofra Archer

ఉప్పల్ స్డేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతోన్న తొలి ఐపీఎల్ మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు రెచ్చిపోయి మరీ ఆడారు.  ఫోర్లు, సిక్సర్లతో దంచికొడుతూ రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. దీంతో 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. సన్రైజర్స్ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ ఏకంగా సెంచరీ బాదాడు. ఐపీఎల్ 2025లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం.

Also read :  SRH vs RR : సన్రైజర్స్ హైదరాబాద్ సంచలన రికార్డు...IPL చరిత్రలోనే!

జోఫ్రా ఆర్చరీ పరమ చెత్త రికార్డు

ఇదే మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ జోఫ్రా ఆర్చరీ పరమ చెత్త రికార్డు నెలకొల్పాడు. వేసిన నాలుగు ఓవర్లలో ఏకంగా 76 పరుగులు ఇచ్చాడు.  ఐపీఎల్ చరిత్రలోనే ఏ బౌలర్ కూడా ఇన్ని పరుగులు ఇవ్వలేదు.   IPL 2025 మెగా వేలంలో ఇంగ్లండ్ కు చెందిన జోఫ్రా ఆర్చర్‌ను  రాజస్థాన్ రాయల్స్ ఏకంగా రూ. 12 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. కానీ ఫస్ట్ మ్యాచ్ లోనే అతను ఆ జట్టును తీవ్రంగా నిరాశపరిచాడు. 76 పరుగులు ఇచ్చి కనీసం ఒక వికెట్ కూడా తీయలేదు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అతని వేసిన బంతులను చీల్చి చెండాడరు. 2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 4 ఓవర్లలో 73 పరుగులు ఇచ్చిన మోహిత్ శర్మను జోఫ్రా ఆర్చర్ అధిగమించాడు.  

Also Read :  ఆస్పత్రికి అల్లు అర్జున్... టెన్షన్ లో అల్లు ఫ్యామిలీ

Also Read :  నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్!

ఐపీఎల్ చరిత్రలో అత్యంత పరుగులు ఇచ్చిన బౌలర్లు! 

జోఫ్రా ఆర్చర్    76  (2025)
మోహిత్ శర్మ 73
బాసిల్ తంపి    70
యష్ దయాళ్69
రీస్ టోప్లీ 68

Also Read :  ప్రధాని నుంచి సినీ తారల వరకు అంతా షాకయ్యారు! అసలు 'Adolescence' సీరీస్ లో ఏముంది?

 

srh-vs-rr | rajasthan-royals | telugu-sports-news | telugu-cricket-news | latest-telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు