/rtv/media/media_files/2025/12/31/thieves-use-drill-to-steal-30-million-euros-in-german-bank-heist-2025-12-31-18-53-01.jpg)
Thieves use drill to steal 30 million euros in German bank heist
జర్మనీలో భారీ చోరి జరిగింది. ఓ బ్యాంకులో నుంచి దొంగలు ఏకంగా రూ.316 కోట్లను దోపిడి చేశారు. క్రిస్మస్ సెలవులు ఉన్న నేపథ్యంలో రెండ్రోజుల పాటు బ్యాంకులో ఉన్న దొంగలు ఈ భారీ దొంగతనానికి ఒడిగట్టారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. బుయర్ ప్రాంతంలో ఉన్న స్పార్కాసై అనే బ్యాంకును కొందరు దుండగులు టార్గెట్ చేశారు. దీంతో దాని పక్కనే ఉన్న పార్కింగ్ గ్యారెజీ నుంచి బ్యాంకులోకి వెళ్లారు.
గ్యారేజి నుంచి భూగర్భంలో ఉన్న వాల్ట్ రూమ్‌కు డ్రిల్‌తో రంధ్రం చేశారు. ఆ తర్వాత బ్యాంకులోకి ప్రవేశించారు. 3 వేలకు పైగా సేఫ్ డిపాజిట్ బాక్సులను పగులగొట్టారు. అందులో ఉన్న బంగారు ఆభరణాలు, నగలు, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. సోమవారం తెల్లవారుజామున ఫైర్ అలారం మోగింది. దీంతో బ్యాంకు దోపిడీ జరిగిన విషయం బయటపడింది. సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి వచ్చారు.
Also Read: వొడాఫోన్ ఐడియాకు కేంద్రం బిగ్ రిలీఫ్.. రూ. 87,695 కోట్ల బకాయిల నిలిపివేత!
వాల్ట్‌రూమ్ దగ్గర్లో దుండగులు చేసిన రంధ్రాన్ని గుర్తించారు. శని, ఆదివారం మధ్య రాత్రి సమయంలో కొంతమంది పెద్ద పెద్ద సంచులు మోసుకుంటూ వెళ్లడం తాము చూసినట్లు అక్కడున్న స్థానికులు తెలిపారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు బ్యాంకు దగ్గర్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. సోమవారం ఉదయం మాస్కులతో ఉన్న వ్యక్తులు కారులో బయటికి వెళ్లిపోయినట్లు గుర్తించారు. ప్రస్తుతం క్రిస్మస్ సెలవులు ఉన్న క్రమంలోనే దొంగలు సమయం చూసుకొని దోపిడికి పాల్పడ్డారని తెలిపారు.
బ్యాంకులోని మొత్తం సేఫ్ డిపాజిట్ బాక్సుల్లో 95 శాతం దాకా దోపిడీ అయినట్లు బ్యాంకు అధికారులు చెప్పారు. ఒక్కో బాక్సు పరిమితి విలువ 10,300 యూరోలు ఉంటుందన్నారు. మొత్తంగా 30 మిలియన్ యూరోలు (రూ.316 కోట్లు)గా అంచనా వేశామని తెలిపారు. మరోవైపు బ్యాంకులో దోపిడి జరగడంపై వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం బ్యాంకు వద్దకు చేరుకుని నిరసనలు దిగారు. దీంతో భద్రతా కారణాల నేపథ్యంలో అధికారులు బ్యాంకును మూసివేశారు. బీమా కంపెనీతో కలిసి క్లైయిమ్ ప్రక్రియ చేపడతామని చెప్పారు. ఈ ఘటన తమల్ని దిగ్భ్రాంతికి గురిచేసినట్లు పేర్కొన్నారు. కస్టమర్లకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Also Read: ఫుల్లుగా తాగి పడిపోతే ఇంటిదగ్గర దింపేస్తాం.. న్యూఇయర్ వేడుకల వేళ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Follow Us