ఏసీసీ కొత్త అధ్యక్షుడుగా.. శ్రీలంక లెజెండ్

ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా శ్రీలంక లెజెండ్ షమ్మీ సిల్వా బాధ్యతలు స్వీకరించారు. ఐసీసీ అధ్యక్షుడిగా జైషా బాధ్యతలు స్వీకరించడంతో ఏసీసీ ప్లేస్‌లో షమ్మీ బాధ్యతలు తీసుకున్నారు. గతంలో షమ్మీ ఏసీసీలో ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు. 

New Update
ACC shammi

ఐసీసీ అధ్యక్షుడిగా జై షా బాధ్యతలు స్వీకరించడంతో అతని ప్లేస్ ఖాళీ అయ్యింది. దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా శ్రీలంక లెజెండ్ షమ్మీ సిల్వా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు సిల్వా గతంలో ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు. 

ఇది కూడా చూడండి: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు

ఇది కూడా చూడండి: Farmer suicide: తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య

ఐక్యమత్యంతో కలిసి పనిచేస్తానని..

ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌కు నాయకత్వం వహించడం గొప్ప వరమని షమ్మీ తెలిపారు. ఆసియా గుండె చప్పుడు క్రికెట్ అని, ఆటను ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్లి, సభ్య దేశాలతో ఐక్యమత్యంతో కలిసి పనిచేస్తానని షమ్మీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. 

ఇది కూడా చూడండి: సంధ్య థియేటర్ ఘటనపై ఎట్టకేలకు స్పందించిన బన్నీ.. బాధిత కుటుంబానికి 25 లక్షల సాయం

ఇదిలా ఉండగా షమ్మీ శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా మూడుసార్లు ఉన్నారు. శ్రీలంక తరఫున క్రికెట్ ఎప్పుడూ ఆడలేదు. కేవలం 4 ఫస్ట్ క్లాస్, ఒక లిస్ట్ ఎ మ్యాచ్ ఆడారు. అయితే క్రికెట్ మ్యాచ్‌లు ఆడటం కంటే అడ్మినిస్ట్రేటర్‌గా మాత్రం ఎన్నో మంచి పనులు చేశారు. ఈ కారణంతోనే షమ్మీని ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు అధ్యక్షుడిగా నియమించారట. 

ఇది కూడా చూడండి:  ఇంటర్నెట్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. తక్కువ ఖరీదుకే కనెక్షన్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు