America: కొడుకుకే కాదు..మరికొందరికి కూడా..!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తన కుమారుడు హంటర్‌ బైడెన్ కు పలు కేసుల నుంచి పూర్తి ఉపశమనం కల్పించిన విషయం తెలిసిందే. ఆయన అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగడానికి ముందే కొందరు అధికారులు,మిత్రులకు క్షమాభిక్ష అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

New Update
BIG BREAKING: అధ్యక్ష రేసు నుంచి తప్పుకోనున్న జో బైడెన్!

America:  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్ కు పలు కేసుల నుంచి పూర్తి ఉపశమనం కల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బైడెన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆయన అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగడానికి ముందే కొందరు అధికారులు , మిత్రులకు క్షమాభిక్ష అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆ మేరకు అక్కడి వార్తా పత్రికల్లో  కథనాలు ప్రచురితమవుతున్నాయి.

Also Read: Google Maps: మరోసారి దారి తప్పించిన గూగుల్‌ తల్లి..ఈసారి అడవి పాలు!

అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్‌ ట్రంప్‌ మరికొన్నిరోజుల్లో అధికార బాధ్యతలు స్వీకరించనున్నారు.ఈ క్రమంలో ట్రంప్‌ బాధ్యతలు చేపట్టాక బైడెన్‌ అనుకూలదారులు, అధికారులను, మిత్రులను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని ప్రస్తుత అధ్యక్షుడు భావిస్తున్నారు. అందుకే తాను బాధ్యతల నుంచి వైదొలగక ముందే వారందరికీ  క్షమాభిక్ష అమలు చేయాలని అనుకుంటున్నారంట.

Also Read: Ap: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు అలర్ట్..!

ఈ మేరకు సీనియర్‌ సహా నాయకులు, వైట్‌ హౌస్‌ లాయర్లతో చర్చలు జరుపుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మాజీ ప్రత్యేక సలహాదారు ఆంథోనీ ఫౌసీ, ట్రంప్‌ ను తీవ్రంగా విమర్శించే మాజీ  చట్టసభ సభ్యుడు లిజ్‌చెనీ, కాలిఫోర్నియాకు డెమోక్రటిక్‌ ప్రతినిధి ఆడమ్‌ షిఫ్‌,రిటైర్డ్‌ జనరల్‌ మార్క్‌ మిల్లీ తదితరులు ఈ క్షమాభిక్ష అమలు లిస్ట్‌ లో ఉన్నట్లు సమాచారం.

Also Read: Ap Rains: బంగాళాఖాతంలో మరో వాయుగుండం..ముంచుకొస్తున్న మూడు తుపాన్లు!

ఇతర క్షమాపణలు అంశం పై బైడెన్‌ సమీక్షిస్తున్నారు అని వైట్‌ హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరీన్‌ జీన్‌ పియర్‌ పేర్కొన్నారు.ఇదిలా ఉండగా..డొనాల్డ్‌ ట్రంప్‌ సైతం తన పదవీకాలం చివరిలో మాజీ చీఫ్‌ స్ట్రాటజిస్ట్‌ స్టీవ్‌ బానన్‌, మాజీ ప్రధాని రిపబ్లికన్‌ నిధుల సమీకరణదారు ఇలియట్‌ బ్రాడీతో సహా 74 మందికి క్షమాభిక్ష అమలు చేశారు. 

Also Raed: Telangana: ప్రొడ్యూసర్‌ దిల్‌రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి

2018 లో తుపాకీ కొనుగోలు సందర్భంగా ఆయుధ డీలరుకు ఇచ్చిన దరఖాస్తు ఫారంలో హంటర్‌ తప్పుడు సమాచారం ఇచ్చారు.తాను అక్రమంగా డ్రగ్స్‌ కొనుగోలు చేయలేదని,వాటికి బానిస కాలేదని,తన వద్ద అక్రమంగా ఆయుధం లేదని వెల్లడించారు. అయితే హంటర్‌ అప్పటికే డ్రగ్స్‌ అక్రమంగా కొనుగోలు చేయడం,వాటికి బానిస కావడంతో పాటు 11 రోజుల పాటు అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నారు.

ఇక కాలిఫోర్నియాలో 1.4 మిలియన్‌ డాలర్ల పన్ను ఎగవేత ఆరోపణలతో ఆయన పై కేసు నమోదైంది.అక్రమ ఆయుధం కొనుగోలు వ్యవహారంలో హంటర్‌ పై నమోదైన కేసులో ఈ ఏడాది జూన్‌ లో న్యాయస్థానం ఆయనను దోషిగా తేల్చింది. అయితే ఇప్పటి వరకు శిక్ష ఖరారు చేయలేదు. ఈ క్రమంలోనే అధ్యక్షుడు జో బైడెన్‌ కుమారుడికి క్షమాభిక్ష కల్పిస్తున్నట్లు ప్రకటించారు. తన కుమారుడి పై కేసులు రాజకీయ ప్రేరేపితమైనవేనని ఆయన ఆరోపించారు. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు