/rtv/media/media_files/yTkQiV8pHFJ5MAlY4cCY.jpg)
Ap: ఏపీ,తమిళనాడు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉంది. హిందూ మహాసముద్రం,దానికి అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో శనివారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో శనివారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది.
Also Read: Google Maps: మరోసారి దారి తప్పించిన గూగుల్ తల్లి..ఈసారి అడవి పాలు!
ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 12 నాటికి శ్రీలంక తమిళనాడు తీరాలకు చేరువవుతుందని అంచనా వేస్తోంది.దీని ప్రభావంతో 11,12 తేదీల్లో తమిళనాడులో, 12 న దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలుస్తుంది.
Also Read: Mytri Movie Makers: పుష్ప–2 షేక్ డైలాగ్స్‌పై టీమ్ సీరియస్ వార్నింగ్
అల్పపీడనం వాయుగుండం మారే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అల్పపీడనం ఏర్పడిన తరువాత దీని పై పూర్తి స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు.
Also Read: Cricket: సిరాజ్‌ను తిడుతున్న ఆస్ట్రేలియా మీడియా..అసలేమైంది?
వర్షాలే కానీ భారీ వర్షాలు..
రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధారణ వర్షాలేకానీ భారీ వర్షాలు లేవని అధికారులు పేర్కొన్నారు. అయితే హిందూ మహా సముద్రంతోపాటు ఆగ్నేయ ఆసియాలో మూడు తుపాన్లు ఉన్నట్లు ప్రకటించారు. ఈ మేఘాలన్నీ బంగాళాఖాతంవైపు కదులుతుండటంతో తుపానుకు అవకాశం ఏమైనా ఉందేమో చూడాలని అధికారులు అంటున్నారు. పంట కోతలను వేగంగా పూర్తిచేసిన అన్నదాతలు నేడు అనంతపురం, నంద్యాల, ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, కోనసీమ, అల్లూరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణం కేంద్రం అధికారులు తెలిపారు.
Also Read: తెలంగాణకు 7 నవోదయ, ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలు ఆమోదం..
అయితే తెలంగాణకు మాత్రం ఎటువంటి వర్ష సూచనలు లేవు. చలి మాత్రం తీవ్రంగా ఉంటోంది. రాత్రివేళ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందంటున్నారు. ఈ నెల మొదటివారంలో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీలోని అన్నదాతలు పంట కోతలను వేగంగా పూర్తిచేశారు. వాస్తవానికి జనవరిలో పంట చేతికి వస్తుంది. అకాల వర్షాల వల్ల ధాన్యంలో తేమశాతం అధికంగా ఉంది. ఏపీ ప్రభుత్వం తేమ శాతం 25 వరకు ఉన్నప్పటికీ వీటిని కొనుగోలు చేసి 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయనుంది.