Political Crisis: ఆ దేశ ప్రధాని రాజీనామా..ఏడాదిలో ఐదుగురు ప్రధానుల రిజైన్

ఫ్రాన్స్‌లో రాజకీయ అనిశ్చితి మళ్లీ మొదటికొచ్చింది. ఇటీవల ప్రధానిగా నియమితుడైన సెబాస్టియన్ లెకోర్ను మంత్రి వర్గాన్ని ప్రకటించిన కొద్ది గంటలకే తన రాజీనామా ప్రకటించారు. ఆయన రాజీనామా చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయంశంగా మారింది.

New Update
Sebastien Lecornu Resigns

Sebastien Lecornu Resigns

France : ఫ్రాన్స్‌లో రాజకీయ అనిశ్చితి మళ్లీ మొదటికొచ్చింది. ఇటీవల ప్రధానిగా నియమితుడైన సెబాస్టియన్ లెకోర్ను (Sebastien Lecornu) మంత్రి వర్గాన్ని ప్రకటించిన కొద్ది గంటలకే తన రాజీనామా ప్రకటించారు. ఆయన రాజీనామా చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయంశంగా మారింది. గత సెప్టెంబర్‌ 9న ప్రధానిగా పదవిని చేపట్టిన ఆయన నెలలోపే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సెబాస్టియన్‌ రాజీనామాతో ఫ్ర్యాన్స్‌లో రాజకీయ అనిశ్చితితో మరోసారి సంక్షోభం ముదిరినట్లయింది.

Also Read :  Nobel Prize 2025: వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్‌..

The Country's Prime Minister Resigns

సెబాస్టియన్‌ రాజీనామాతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్‌కు మరోసారి తలనొప్పి తప్పలేదు. కేవలం ఏడాది కాలంలో ఐదో ప్రధానమంత్రిని నియమించాల్సి రావడంతో ఆయన తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. గత నెలలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో ఫ్రాన్సిస్ బేరో ఓడిపోవడంతో లెకార్ను ప్రధానమంత్రిగా నియమించారు. కానీ ఆయన కేవలం 27 రోజులు మాత్రమే పదవిలో ఉన్నారు. దీంతో ఆయన ఫ్రాన్స్ చరిత్రలో అతి తక్కువ కాలం పదవిలో ఉన్న ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారని చెప్పవచ్చు.

గత నెల పదవిని చేపట్టిన సెబాస్టియన్‌ ఆదివారం కొత్త క్యాబినెట్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఆయన మంత్రివర్గ కూర్పుపై రాజకీయంగా అనేక విమర్శలు వచ్చాయి. దీంతో నియామకాలు జరిగిన కొన్ని గంటల్లోనే ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన రాజీనామాను మెక్రాన్ కూడా ఆమోదించారు. బడ్జెట్‌ సమస్యలు, గాజా పరిస్థితి, ఉక్రెయిన్‌ యుద్ధం, అమెరికా అధ్యక్షుడి తాజా విధానాలు తదితర కారణాలతో ఫ్రాన్స్‌లో గందరగోళం ఏర్పడింది. దీంతో ఆదేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. అవన్నీ కూడా తాజా రాజకీయ అనిశ్చితికి కారణమని భావిస్తున్నారు.  

అయితే లెకార్ను రాజీనామాకు కచ్చితమైన కారణాలు స్పష్టంగా వెల్లడించనప్పటికీ, ఆయన మంత్రివర్గ ఎంపికపై వచ్చిన విమర్శలే కారణమని తెలుస్తోంది. అయితే ఆయన కొత్త మంత్రివర్గంలో 11 మంది మంత్రులు తమ పదవులను నిలబెట్టుకోవడం గమనార్హం. ఇందులో హోంమంత్రి బ్రూనో రిటైల్లో, విదేశాంగ మంత్రి జీన్-నోయెల్ బారోట్ వంటి కీలక వ్యక్తులు ఉన్నారు. దీంతోపాటు మాజీ రక్షణ మంత్రి బ్రూనో లీ మైర్ వంటి వారిని కూడా తిరిగి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఈ ఎంపికలు పాత మంత్రివర్గానికి దగ్గరగా ఉండటంతో అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. దీంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఫ్రాన్స్‌ గత ఏడాది కాలంగా రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. పార్లమెంట్‌లో ఏ పార్టీకి, కూటమికి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో ప్రధానులు ఎక్కువకాలం పదవిలో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. బడ్జెట్ ప్రతిపాదనలకు పార్టీల మద్దతు లభించకపోవడంతో రాజకీయ, ఆర్థిక పరిస్థితుల్లోనూ కూడా అనిశ్చితి నెలకొంది.  ప్రస్తుత రాజీనామాతో బార్డెల్లా జాతీయ అసెంబ్లీని రద్దు చేసి, కొత్త ఎన్నికలు ప్రకటించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌ను అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నారు. అయితే ఆయన ఇప్పటికిప్పుడు రాజీనామా చేసే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో మెక్రాన్ ఎవరిని తదుపరి ప్రధానమంత్రిగా నియమిస్తారనే విషయాలు ఉత్కంఠకు తెరలేపాయి.

Also Read :   9/11 దాడికి ముందే ఒసామా బిన్‌లాడెన్‌ గురించి హెచ్చరించాను.. ట్రంప్ సంచలన ప్రకటన

Advertisment
తాజా కథనాలు