Nobel Prize 2025: వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్‌..

వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం వరించింది. మేరీ ఇ.బ్రున్‌కో, ఫ్రెడ్‌ రామ్స్‌డెల్‌, షిమన్‌ సకాగుచీకీ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. 

New Update
Nobel Prize 2025 in Medicine awarded to Mary E. Brunkow, Fred Ramsdell and Shimon Sakaguchi

Nobel Prize 2025 in Medicine awarded to Mary E. Brunkow, Fred Ramsdell and Shimon Sakaguchi

వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం(Nobel Prize 2025) వరించింది.పెరిఫెరల్ ఇమ్యూన్‌ టాలరెన్స్‌కు సంబంధించి ఆవిష్కరణలు చేసినందుకు గాను మేరీ ఇ.బ్రున్‌కో, ఫ్రెడ్‌ రామ్స్‌డెల్‌, షిమన్‌ సకాగుచీకీ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. ఈ పరిశోధనలు ఆటోఇమ్యూన్(immune-system) వ్యాధులకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు సాయపడే రెగ్యూలేటరీ టీసెల్స్‌ ఎలా పనిచేస్తాయో కనుగోనేందుకు దోహదపడింది. టీ కణాలు అనేవి ఒక రకమైన తెల్ల రక్త కణంగా పరిగణిస్తారు. ఇవి శరీరంలో ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడే రోగనిరోధక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇదిలాఉండాగా వైద్య విభాగంతో నోబెల్‌ పురస్కారాల ప్రారంభం కాగా.. అక్టోబర్ 13 వరకు కొనసాగనుంది.

Also Read :  9/11 దాడికి ముందే ఒసామా బిన్‌లాడెన్‌ గురించి హెచ్చరించాను.. ట్రంప్ సంచలన ప్రకటన

Nobel Prize 2025 In Medicine Awarded

సాధారణంగా రోగనిరోధక వ్యవస్థ (ఇమ్యూనిటీ) అనేది మన శరీరంలోకి వచ్చే బాక్టిరీయా లేదా వైరస్‌లను శత్రువులుగా గుర్తించి వాటిపై దాడి చేస్తుంది. మన శరీరంలో ఉండే కణాలను మాత్రం ఇమ్యూనిటీ శత్రువులుగా గుర్తించదు. ఇలా గుర్తించకుండా నిరోధించే ప్రక్రియనే ఇమ్యూన్‌ టాలరెన్స్ అంటారు. అయితే ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు శరీరానికి అత్యవసరమైన రెగ్యులేటరీ టీ సెల్స్‌ అనే తెల్ల రక్త కణాల రకాన్ని గుర్తించారు. ఈ కణాలే మన శరీరంలో సొంత కణాలపై దాడి చేయకుండా నిరోధిస్తున్నాని కనిపెట్టారు.

Also Read :  అలా చేస్తే అమెరికా అడుక్కోవడం ఖాయం.. విదేశీ విద్యార్ధులపై కీలక నిర్ణయం!

Advertisment
తాజా కథనాలు