/rtv/media/media_files/2025/11/15/thailand-2025-11-15-19-54-15.jpg)
Thailand enforces stricter alcohol laws with fines of over Rs 27,500 to control daytime drinking
థాయ్‌లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వైన్స్ బంద్ చేయాలనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు మద్యం అమ్మడం, కొనడం, తాగడం నేరం. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.26,591 జరిమానా విధించనుంది. ఆల్కహాలిక్ బేవరేజ్ కంట్రోల్ యాక్ట్ కింద థాయ్‌లాండ్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 8 నుంచే ఈ నిబంధన అమల్లోకి వచ్చింది.
Also Read: బీహార్ ఎన్నికల్లో మరో ట్విస్ట్.. బీజేపీ, జేడీయూ కన్నా ఆర్జేడీకే ఎక్కువ ఓట్లు
ఈ కొత్త రూల్స్ ప్రకారం కూడా కొన్ని మద్యం విషయంలో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. లైసెన్స్ పొందిన ఎంటర్‌టైన్మెంట్ ఈవెంట్స్, హోటల్స్, ఎయిర్‌పోర్ట్స్, పర్యాటక రంగం కింద ఉన్న సంస్థలు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు మద్యం అమ్మడం, కొనుగోలు చేసేందుకు పర్మిషన్ ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నియమం వల్ల రెస్టారెంట్ రంగం సమస్యల్లో ఇరుక్కుంటుందని అసోసియేషన్ ఆఫ్ థాయ్‌లాండ్ అధ్యక్షుడు చానన్ కోట్చరోన్ ఆరోపిస్తున్నారు.
Also Read: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా.. లాలూ యాదవ్ కూతురు సంచలన నిర్ణయం
ఉదాహరణకు ఒక వినియోగదారుడు తెల్లవారుజామున మందు కొనుక్కుని మధ్యాహ్నం 2.05 నిమిషాలకు తాగిన అది రూల్‌ను ఉల్లంఘించినట్లే అవుతందని పేర్కొన్నారు. దీనివల్ల మద్యం అమ్మకాలు పడిపోయి ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Follow Us