Elon Musk: ట్రంప్ విజయం..ఎలాన్ మస్క్‌కు డబ్బులే డబ్బులు

 ట్రంప్ విజయం వల్ల ఎవరికి లాభం ఉన్న లేకపోయినా ఎలాన్ మస్క్ పంట మాత్రం బాగా పండుతోంది. ఎన్నికల తర్వాత టెస్లా షేర్లు అమాంతం ఒక్కసారి పెరిగిపోయాయి. దీంతో ఒకేరోజు మస్క్ నికర లాభం 26 బిలియన్ డాలర్లు పెరిగింది. 

author-image
By Manogna alamuru
New Update
Elon Musk : ఇప్పుడు రావడం లేదు.. భారత్‌లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా

Tesla Shares hike: 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రప్ ఎప్పుడైతే గెలిచాడో అమెరికాలో బిజినెస్ చేసే వారి అందరికీ మంచి రోజులు వచ్చాయని ఆనందపడ్డారు. అనుకున్నట్టుగానే అవుతోంది కూడా. ముఖ్యంగా ఎలాన్ మస్క్ కు అందరికంటే ఎక్కువ లాభపడుతున్నారు. ఎన్నికల తర్వాత టెస్లా షేర్లు భారీగా పెరిగిపోయాయి. దీంతో మస్క్‌కు ఒకేరజులో 26 బిలియన్ డాలర్లు లాభం వచ్చింది. టెస్లా షేర్లు 14.75 శాతం పెరిగి మస్క్ సందప 290 బిలియన్ డాలర్లకు చేరుకుంది.దీంతో  ఈ ఏడాదిలో మస్క్ నికర విలువ 60 బిలియన్ డాలర్లు పెరిగింది. ట్రంప్ వ్యాపార అనుకూల విధానాలు టెస్లా షేర్లను అమాంతం పెంచాయి.

Also Read: 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!

అమెరికా అయక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు ఎలాన్ మస్క్ మొదటి నుంచీ మద్దతు ఇచ్చారు. ఒకరకంగా యన విజయంలో మస్క్ కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. ఇద్దరూ ఒకరిని ఒకరు తెగ పొగుడుకుంటారు కూడా. తన గెలుపులో మస్క్ కీలకపాత్ర పోషించాడని అమెరికా రాజకీయ చరిత్రలో మస్క్ కొత్త హీరో అని ట్రంప్ తన విక్టరీ స్పీచ్లో కూడా చెప్పాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఎన్నిక కోసం మస్క్ 120 మిలియన్ డాలర్ల విరాళం కూడా ఇచ్చాడు. ఇది ఇక్కడితో ఆగిపోయేది కాదు కూడా. ట్రంప్ ఉన్నన్నాళ్ళూ ఎలాన్ మస్క్ వ్యాపారం తారాజువ్వలా దూసుకుపోతుది అనడంలో ఎటువంటి డౌట్ లేదు.   

 

Also Read: అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సెల్లర్స్ ఇళ్ళల్లో ఈడీ సోదాలు

Also Read: ఫోకస్ అంతా అతడిమీదే.. జట్టులో పర్మినెంట్‌గా ఉంచండి: కుంబ్లే

Advertisment
Advertisment
తాజా కథనాలు