ED Raids: అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సెల్లర్స్ ఇళ్ళల్లో ఈడీ సోదాలు అమెజాన్‌తో సహా ఈ కామర్స్ ఫ్లాట్ ఫామ్‌లలో అమ్మకాలు చేసేవారిపై ఈ రజు ఈడీ రైడ్స్ చేసింది. దేశ వ్యాప్తంగా 24 మంది ఇళ్ళల్లో ఈడీ సోదాలు జరిపింది. మనీలాండరింగ్ ఆరోపణలు నేపథ్యంలో ఇవి చేసినట్టు తెలుస్తోంది. By Manogna alamuru 07 Nov 2024 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ED Raids: అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తో సహా ప్రధాన ఈ కామర్స్ ప్లాట్ ఫాం లకు సంబంధించిన విక్రేతలను లక్ష్యంగా చేసుకొని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. వీరు ఆర్ధిక లావాదేవీల్లో అవకతవకలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. రెడు నెలల క్రితం సెప్టెంబర్ లో కూడా యాంటీ ట్రస్ట్ అథారిటీ జరిపిన దర్యాప్తులలో అమెజాన్, వాల్ మార్ట్, ఫ్లిప్ కార్ట్ తమ ఫ్లాట్ ఫాంలపై కొంత మంది సెల్లార్లకు అనుకూలంగా రూల్స్, చట్టాలను ఉల్లంఘించాయని ఈడీ చెబుతోంది. దీంతో ఈడీ దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించింది. మొత్తం 24 చోట్ల, నాలుగు నగరాల్లో ఈడీ అధికారులు దాడులు చేశారు. ఢిల్లీ, ముంబయ్, హైదరాబాద్, బెంగళూరుల్లో ఈ కామర్స్ దిగ్గజాల అనుబంధ సంస్థలతో పాటూ పలువురి వ్యాపారస్తుల ఇళ్ళలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఇది కూడా చదవండి: LMV లైసెన్స్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. సుప్రీం కోర్టు కీలక తీర్పు #ED-investigation #Amazon-Flipkart-probe #Flipkart-sellers #Amazon-sellers మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి