Australia: 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!

సోషల్ మీడియా యుగంలో పిల్లల భవిష్యత్ దెబ్బతినకూడదన్న ఉద్దేశంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా ఉపయోగించకుండా నిషేధించాలని ఆలోచిస్తుంది.

New Update
aus

Australia: ప్రస్తుత రోజుల్లో మనిషి మొబైల్‌ నిత్యావసర వస్తువు మాదిరిగా మారిపోయింది. వయసుతో సంబంధం లేకుండా సెల్ ఫోన్‌ ని విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. పక్క మనిషితో మాట్లాడటానికి కూడా సమయమే ఉండడం లేదు. అంతలా మొబైల్‌ ప్రపంచంలో మునిగిపోతున్నారు. 

అసలే స్మార్ట్ ఫోన్ కు మనిషి బానిసగా మారితే.. దానికి జోడిగా సోషల్‌ మీడియా కూడా వచ్చి చేరింది. దాంతో పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. రీల్స్‌ చేయడం... ప్రోగ్రామ్స్‌ చేయడం మొదలు పెట్టారు. ఈ మొబైల్స్‌ కి పిల్లలు మరి బానిసలుగా తయారయ్యారు. ఇవి వారికి అనేక చెడు వ్యసనాలను నేర్పిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.  

Also Read: ED Raids: అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సెల్లర్స్ ఇళ్ళల్లో ఈడీ సోదాలు


సోషల్ మీడియా యుగంలో పిల్లల భవిష్యత్ దెబ్బతినకూడదన్న ఉద్దేశంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకునే దిశగా వెళ్తోంది. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా ఉపయోగించకుండా కఠిన చర్యలు తీసుకుని వాటిని ఇక నుంచి  నిషేధించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆలోచిస్తుంది. 

Also Read: తల్లి, చెల్లి అని కూడా చూడట్లేదు.. నేను సైకోల బాధితురాలినే: షర్మిల

ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, ఫేస్‌బుక్ మొదలైన సోషల్ మీడియా యాప్‌లను ఉపయోగించకుండా 16 ఏళ్లలోపు పిల్లలను నిషేధించడానికి ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా చట్టాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు ఆస్ట్రేలియా తెలిపింది. ఈ చట్టాన్ని ఈ ఏడాదే ఆస్ట్రేలియా పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నారు. చట్టం చేయగానే 12 నెలల్లోనే అమలులోకి రానుంది. 

Also Read: Jet Airways కథ ముగిసినట్లే..సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!

సోషల్ మీడియా ప్రభావం కారణంగా యువత చెడిపోతుందన్న ఆలోచనతోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. అశ్లీల చిత్రాలు, దృశ్యాలు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వైరల్ అవుతుండడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. యువత పెడదారిన పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే తల్లిదండ్రులు, మేధావులతో ఈ అంశం గురించి ప్రభుత్వం చర్చించింది.

Also Read: Pawan Kalyan: వాలంటీర్లకు బిగ్‌ షాక్‌...డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు!

సోషల్ మీడియా కారణంగా పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నట్లు కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. కచ్చితంగా సోషల్ మీడియాపై నిషేధం విధించాలని ప్రభుత్వానికి తల్లిదండ్రులు, మేధావులు సూచించారు. చట్టం అమల్లోకి వస్తే.. వయసును నిర్ధారించడానికి ప్రత్యేకమైన eSafety కమిషనర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే eSafety కమిషన్ జరిమానాలు విధించనుంది. నవంబర్‌లోనే ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టడానికి కసరత్తు చేస్తున్నారు.

ఈ అంశంపై ఆ దేశ ప్రధాని అల్బనీస్ మాట్లాడుతూ.. 16 యేళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోందన్నారు. ఆన్ లైన్ లో చెడుగా ప్రభావితం చేసే అంశాల నుంచి పిల్లలను రక్షించడం తమ బాధ్యత అని అన్నారు. చాలా మంది పేరెంట్స్ ఆన్ లైన్లో పిల్లల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వారికి అండగా ఉందన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు