AP:  ఏపీలో ఎన్టీపీసీ 1, 87,00 కోట్ల ఒప్పందం..లక్షమందికి ఉద్యోగాలు

ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. పునరుత్పాదక రంగంలో ప్రాజెక్టులు పెట్టేందుకు.. రూ.1,87,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.

New Update
110

NTPC Investing IN AP: 

ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల మీద వరుసగా ఒప్పందాలు కుదుర్చుకుంటోంది ఏపీ గవర్నమెంట్. పెట్టుబడులతో రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించాలని భావిస్తోంది. దీని కోసం దేశ, విదేశాల చెందిన సంస్థలను ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే టాటా లాంటి చాలా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పుడు తాజాగా నేషనల్  థర్మల్ పవర్ కార్పరేషన్ ఈ లిస్ట్‌లో చేరింది. ఆంధ్రాలో రూ.1.87 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది ఎన్టీపీసీ. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, గొట్టిపాటి రవి సమక్షంలో ఒప్పందం జరిగింది.

ఎన్టీపీసీ పెట్టుబడులతో వచ్చే 25 ఏళ్ళల్లో ఏపీలో రూ.20,620 కోట్ల ఆదాయం రానుందని చెబుతున్నారు. అంతేకాదు దీంతో 1.06 లక్షల ఉద్యోగాలు కూడా రానున్నాయి. ఏపీలో పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఎన్టీపీసీ సంస్థ తన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: TS: ఎన్నికలకు సిద్ధంకండి..డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Advertisment
Advertisment
తాజా కథనాలు