Hyderabad: అమెరికాలో సొంత తుపాకీ పేలి హైదరాబాద్ యువకుడి మృతి! సొంత తుపాకీ ప్రమాదవశాత్తు పేలి అమెరికాలో హైదరాబాదీ విద్యార్థి పాల్వాయి ఆర్యన్ రెడ్డి మృతి చెందాడు. ఆర్యన్ జార్జియాలోని అట్లాంటాలో ఉన్న కెన్నెసా స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ రెండో ఏడాది చదువుతున్నాడు. By Bhavana 22 Nov 2024 in తెలంగాణ ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి America: సొంత తుపాకీ ప్రమాదవశాత్తు పేలి అమెరికాలో హైదరాబాదీ విద్యార్థి ఒకరు మృతి చెందారు. జార్జియాలోని అట్లాంటాలో ఉన్న కెన్నెసా స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ రెండో ఏడాది చదివే పాల్వాయి ఆర్యన్ రెడ్డి (23) ఈ నెల 13న మృతి చెందగా..ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. Also Read: TG:తాగినోళ్లకు తాగినంత...మందుబాబులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే ఆఫర్! యువకుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...ఉప్పల్ లోని ధర్మపురి కాలనీలో నివసించే పాల్వాయి సుదర్శన్ రెడ్డి, గీత దంపతులు ఏకైక కుమారుడు ఆర్యన్ రెడ్డి గతేడాది డిసెబంర్ లో ఉన్నత చదువులు చదివేందుకు అమెరికా వెళ్లాడు. Also Read:గేమ్ ఛేంజర్ అవుట్ పుట్ చూశా.. దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది: SJ సూర్య ఈ నెల 13న స్నేహితులతో కలిసి తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు. అదే రోజు రాత్రి ఆర్యన్ గది నుంచి గన్ పేలిన శబ్దం వచ్చింది. ఫ్రెండ్స్ గది లోకి వెళ్లి చూడగా..ఆర్యన్ ఛాతీలోకి తుపాకీ దూసుకుపోయింది. దీంతో ఆర్యన్ అక్కడికక్కడే మృతి చెందాడు. Also Read: రేవంత్ ప్రభుత్వానికి షాక్..సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేసిన ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రమాదవశాత్తు పేలి.. గన్ ని క్లీన్ చేసే సమయంలో ప్రమాదవశాత్తు పేలి ఆర్యన్ మృతి చెంది ఉంటాడని ఆయన తండ్రి అభిప్రాయపడ్డారు. దేశసేవ అంటే ఆర్యన్ చాలా ఆసక్తి చూపేవాడని తండ్రి తెలిపారు. ఆర్మీలో చేరతానంటే తామే వద్దని వారించామన్నారు. అమెరికాలో ఉన్నగన్ కల్చరే తమ కుమారుడిని పొట్టన పెట్టుకుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Also Read: RBI: ఐదు బ్యాంకుల మీద కొరడా ఝళిపించిన ఆర్బీఐ..భారీ జరిమానా అక్కడ విద్యార్థులకు కూడా గన్ లైసెన్సుఉల ఇస్తారనే విషయం ఇప్పుడే తెలిసిందన్నారు. ఆర్యన్ రెడ్డి ఈ ఏడాది ఆగస్టులోనే హంటింగ్ గన్ కు లైసెన్స్ తీసుకున్నట్లు సమాచారం. దాని కోసం ఓ పరీక్ష కూడా రాశారు. #america #gun-fire #crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి