/rtv/media/media_files/2025/12/26/fotojet-10-2025-12-26-15-05-55.jpg)
Tehreek-e-Taliban Pakistan
TTP: తమ దేశ రక్షణకు ఆయా దేశాలు వైమానిక దళాలను ఏర్పాటు చేసుకోవడం సర్వసాధారణం. కానీ, ఒక ఉగ్రవాద సంస్థ వైమానిక దళం(air-force) ఏర్పాటు చేయడమంటే అంత ఆషామాషీకాదు. కానీ, పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ ఒకటి త్వరలో వైమానిక దళం ఏర్పాటు చేస్తామని ప్రకటించి సంచలనం రేపింది. ఆ సంస్థ పేరు తెహ్రీకే తాలిబన్ పాకిస్థాన్(tehreek e taliban pakistan attacks) (టీటీపీ). అఫ్టానిస్థాన్‌కు చెందిన తాలిబన్ మద్ధతు ఉందని భావిస్తున్న ఈ ఉగ్రసంస్థ అఫ్గానిస్థాన్(afghanistan) లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చాక, తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. అంతేకాదు కొత్త ప్రణాళికలను రూపొందిస్తోంది.
Also Read : బంగ్లాదేశ్‌లో ఎన్నికలు.. షేక్ హసీనా స్థానం నుంచి హిందూ అభ్యర్థి పోటీ
Terrorist Organization That Is Showing Signs Of Pakistan
అంతేకాదు, 2026లో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు టీటీపీ వైమానిక దళం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించింది. పాక్ సైన్యానికి పోటీగా వైమానిక దళం ఏర్పాటు చేస్తామని సామాజిక మాధ్యమాల్లో పలు పోస్టులు చేసింది. ఈ వార్త పాక్ అధికారులను కలవరపెడుతోంది.టీటీపీ వర్గాల కథనం ప్రకారం సలీం హక్కానీ నేతృత్వంలో ఈ వైమానిక దళాన్ని నడిపించనున్నారు.ప్రావిన్స్‌ల వారీగా మోహరింపులు, మిలిటరీ యూనిట్లను ఏర్పాటు చేయాలని, అలాగే మిలిటరీ కమాండర్లతో కూడిన రెండు కొత్త పర్యవేక్షణ జోన్‌లను ఏర్పాటు చేయాలని టీటీపీ భావిస్తోందని వెల్లడించింది.
2026లో ఏర్పాటు చేసేఈ వైమానిక దళం ద్వారా కశ్మీర్, గిల్గిత్- బాల్టిస్థాన్‌తో సహా మరికొన్ని ప్రావిన్స్‌లను తమ ఆధీనంలోకి తీసుకోవాలని టీటీపీ ప్లాన్ చేస్తోంది. మిలిటరీ యూనిట్లలో నాయకత్వ మార్పులు కూడా చేపట్టింది. టీటీపీ2022 నవంబరులో పాక్ ప్రభుత్వంతో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ముగించింది. ఆ తర్వాత నుంచి పాక్ (Pakistan) భద్రతా దళాలు, పోలీసులు, అధికారులపై టీటీపీ వరుస దాడులకు దిగుతోంది. ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వా, బలోచిస్థాన్ ప్రావిన్స్‌లలో తన కార్యకలాపాలను విస్తరించింది. అఫ్గానిస్థాన్ భూభాగం నుంచే టీటీపీ ఉగ్రదాడులకు పాల్పడుతుందని పాక్ అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే, తాలిబన్ ప్రభుత్వం మాత్ర ఆరోపణలను ఖండిస్తోంది. - afghanistan pakistan
Also Read : కెనడాలో భారతీయ విద్యార్ధి దారుణ హత్య.. ఆరేళ్లలో 172 మంది బలి
Follow Us