/rtv/media/media_files/2025/12/26/bangladesh-2025-12-26-15-21-52.jpg)
The Hindu Candidate Running For Sheikh Hasina's Seat And His Opponents
బంగ్లాదేశ్(bangladesh)లో హిందువులపై దాడులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల దీపు చంద్రదాస్ హత్య ఘటన మరువకముందే మరో హిందూ యువకుడిని గ్రామస్థులు కొట్టి చంపేశారు. ఇలాంటి తరుణంలో బంగ్లాదేశ్‌కు సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న అక్కడ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని షేక్ హసీనా(sheik-hasina) నియోజకవర్గం నుంచి ఓ హిందూ అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. బంగ్లాదేశ్ జతియ హిందూ మోహజోతే సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రటరీ, అడ్వకేట్ అయిన 'గోబింద చంద్ర ప్రమానిక్' బరిలోకి దిగనున్నారు.
గోపల్‌గంజ్ 3 స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ఈ స్థానం నుంచే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా 2009 నుంచి 2024 వరకు ప్రాతినిధ్యం వహించారు. గతేడాది చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. దీంతో గోపల్‌గంజ్ 3 స్థానం ఖాళీ అయ్యింది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో గోబింద చంద్ర ఈ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాదు డిసెంబర్ 28న ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read: మహిళా మేనేజర్‌పై గ్యాంగ్ రేప్.. కంపెనీ సీఈవోతో సహా ముగ్గురి అరెస్ట్
Hindu Candidate Running For Sheikh Hasina's Seat
తనకు ఏ పార్టీతో సంబంధం లేదని గోబింద చంద్ర స్పష్టం చేశారు. పార్టీల నుంచి ఎంపీగా గెలిచిన వాళ్లు సాధారణ ప్రజల సమస్యలను లేవనెత్తలేకపోతున్నారని అన్నారు. అందుకే తాను ప్రజల తరఫున మాట్లాడేందుకు ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. మరోవైపు హసీనా స్థానం నుంచి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ(BNP) అభ్యర్థి ఎస్‌ఎం జిలానీ, అలాగే నేషనల్ సిటిజెన్ పార్టీ (NCP) పాపర్టీ నుంచి అరిఫుల్ దారియాతో పాటు ఇతర పార్టీల నుంచి కూడా పలువురు అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు.
గతేడాది మాజీ ప్రధాని షేక్ హాసీనా దేశం విడిచి పారిపోయిన అనంతరం యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై రాడికల్ గ్రూపుల దాడులు పెరిగిపోయాయి. హిందువులు, క్రైస్తవులు, సుఫిస్, అహ్మదియ్యా ముస్లింలపై హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో అక్కడి మైనార్టీలో భయాందోళనలో కాలం వెల్లదీస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రాడికల్ గ్రూపులు యాంటీ ఇండియా సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని మైనార్టీలపై చేస్తున్న దాడులను సమర్థించుకుంటున్నాయి. మరోవైపు షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీపై యూనస్ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో వచ్చే ఏడాది ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కూడా అక్కడి ప్రభుత్వం తాజాగా ధ్రువీకరించింది.
Also Read: అమెరికా రక్షణ శాఖ షాకింగ్ విషయాలు.. భారత్‌కు చైనా నుంచే ప్రమాదం!
Follow Us