Dogs: రెండు కుక్కలు కిడ్నాప్.. రూ.9 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌

స్విట్జర్లాండ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రెండు పెంపు శునకాలను ఓ కిడ్నాపర్‌ ఎత్తుకెళ్లాడు. ఆ తర్వాత వాటి యజమానికి 9.8 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. ఆ శునకాలను యజనానికి అప్పగించారు.

New Update
Swiss police rescue two dogs kidnapped for over 1 million ransom

Swiss police rescue two dogs kidnapped for over 1 million ransom

స్విట్జర్లాండ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రెండు పెంపు శునకాలను కిడ్నాపర్‌ అపహరించాడు. ఆ తర్వాత వాటి యజమానికి 9.8 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. చివరికి నిందితుడిని పట్టుకున్నారు. ఆ రెండు శునకాలను యజమానికి అప్పగించారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. స్విట్జర్లాండ్‌లోని జ్యురిక్‌ సమీపంలోని ష్లీరెన్‌లో ఓ వ్యక్తి(59) నివసిస్తున్నారు.      

Also Read: ఎలన్ మస్క్‌ను రంగంలోకి దింపిన ట్రంప్.. సునీతా విలియమ్స్‌ తీసుకొచ్చే డేట్ ఫిక్స్!

ఆయన బోలోంకా జాతికి చెందిన రెండు శునకాలను పెంచుకుంటున్నారు. నిత్యం వాటి ఆలనాపాలన చూసుకుంటున్నారు. గతవారం ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఆయన ఏదో పనిమీద బయటికి వెళ్లారు. పని అయిపోయాక ఇంటికి తిరిగి వచ్చారు. కానీ అక్కడ చూసేసరికి తన పెంపుడు శునకాలు కనిపించలేవు. వాటి కోసం చుట్టుపక్కల వెతికినా ప్రయోజన లేకుండా పోయిది. 

Also Read: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం.. ఎంతకు కొన్నాడు..? ఆ దేశం ప్రత్యేకత ఏంటో తెలుసా?

అయితే అతనికి తన ఇంటి ఆవరణలో ఓ లేఖ కనిపించింది. అందులో నిందితుడు.. శునకాలు కావాలంటే తనకు ఒక మిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్‌లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ లేఖ చూసిన యజమాని షాక్ అయిపోయాడు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు నిందితుడి కోసం రంగంలోకి దిగారు. సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. చివరికి ఆ నిందితుడిని (38) పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడి వద్ద ఉన్న రెండు శునకాలను వాటి యజమానికి అప్పగించారు. 

Also Read: మగాళ్లను మర్డర్ చేసే అవకాశం ఇవ్వండి.. రాష్ట్రపతికి మహిళా నేత సంచలన లేఖ!

Also Read: పెళ్లి చేసుకోకుండా శ్మశానవాటికలోనే.. ఈమెకు బతుకున్న మనుషులంటే భయమట!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు