/rtv/media/media_files/2025/01/25/eJiUvz4OZecrEBPnVraw.jpg)
starbucks
ప్రముఖ కాఫీ బ్రాండ్ స్టార్ బక్స్ సీఈవో బ్రియాన్ నికోల్ తన మొదటి నాలుగు నెలల వేతనం ఏకంగా 96 మిలియన్ డాలర్లు అంటే అక్షరాల సుమారు రూ.827 కోట్లు అందుకున్నారు. అమెరికాలో కార్పొరేట్ అతి పెద్ద ప్యాకేజీల్లో ఇదీ ఒకటి. టెక్ కంపెనీ యాపిల్ సీఈవో టిమ్ కుక్ ,గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కంటే అధిక ప్యాకేజీని నికోల్ అందుకున్నారు.
Also Read: JR NTR- Balakrishna: కంగ్రాట్స్ బాల బాబాయ్.. జూ.ఎన్టీఆర్ సంచలన ట్వీట్!
అదే నాలుగు నెలలకు ఒక్కొక్కరు 75 మిలియన్ డాలర్లు అందుకున్నారు.ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్ తన నివేదికలో వెల్లడించింది.గతేడాది సెప్టెంబర్ ప్రారంభంలో స్టార్ బక్స్ ఓ సీఈవో గా బాధ్యతలు స్వీకరించారు నికోల్. కంపెనీలో చేరిన నెల తరువాత 5 మిలియన్ డాలర్లు సైన్ ఆన్ బోనస్ కూడా అందుకున్నారు.
నికోల్ జీతంలో దాదాపు 94 శాతం స్టాక్ అవార్డుల రూపంలో అందుకున్నట్లు బ్లూమ్ బర్గ్ తన నివేదికలో పేర్కొంది. దీంతో అమెరికాలోని అధిక వేతనాలు అందుకొనే సీఈవోల్లో టాప్ 20 లో నికోల్ నిలిచారు. అయితే నికోలని నియమించుకునే సమయంలో వార్షిక వేతన ప్యాకేజీ 113 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేసింది.
Also Read: Vijaya Sai Reddy: ''మేము అంగీకరించం, కానీ''.. విజయసాయి రెడ్డి నిర్ణయంపై స్పందించిన వైసీపీ
అయితే కేవలం నాలుగు నెలలకే నికోల్ 96 మిలియన్ డాలర్లు అందుకోవడం గమనార్హం. స్టార్ బక్స్ లో అమ్మకాలు క్షీణించిన సమయంలో అప్పుడు కంపెనీ సీఈవో గా ఉన్న భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ ను తొలగించింది.ఆ తరువాత నికోల్ కు స్టార్ బక్స్ ఆ బాధ్యతలు ఇచ్చింది.
ప్రస్తుతం ఆయన ఉన్న ప్రాంతంలోనే తాత్కాలిక గృహా ఖర్చులను భరించేందుకు అలాగే కంపెనీ జెట్ ను ఉపయోగించుకునేందుకు అంగీకరించింది.శుక్రవారం దాఖలు చేసిన వివరాలు ప్రకారం..నికోల్ గృహ వినియోగ అవసరాల కంటే 1,43,000 డాలర్లు అధికంగా కంపెనీ చెల్లించింది.
దక్షిణ కాలిఫోర్నియాలోని తన ఇంటి నుంచి సీటెల్ లోని స్టార్ బక్స్ ప్రధాన కార్యాలయానికి ప్రయాణించడం కోసం మరో 72 వేల డాలర్లు, ఇతర వ్యక్తిగత ఖర్చుల కోసం సుమారు 19 వేల డాలర్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది.
Also Read: Pakistan: భారతీయులను కాపాడిన పాకిస్థాన్ అధికారికి పౌర పురస్కారం.. ఎందుకంటే ?