/rtv/media/media_files/2025/01/25/L1xXKLrMxFL6gGl8J8Kt.jpg)
Asif Bashir
సాధారణంగా అనేక దేశాల్లో వివిధ రంగాల్లో విశేష కృషి చేసినవారికి, అలాగే సామాజిక సేవ చేసిన వారికి పౌర పురస్కాలు వస్తుంటాయి. అయితే భారతీయుల్ని కాపాడిన పాకిస్థాన్‌కు చెందిన ఓ అధికారికి ఆ దేశం అత్యున్నత పౌర పురస్కారం ‘సితారే- ఇంతియాజ్’ లభించింది. పాకిస్థాన్ అధికారి భారతీయుల్ని కాపాడటం ఏంటని అనుకుంటున్నారా ?. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
Also Read: పాకిస్థాన్ జైల్లో భారతీయ ఖైదీ మృతి.. శిక్షా కాలం పూర్తయినప్పటికీ.. !
ఇక వివరాల్లోకి వెళ్తే.. గతేడాది సౌదీ అరేబియాలోని మక్కాలో జరిగిన హజ్‌యాత్రకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది యాత్రికులు హాజరయ్యారు. అయితే అదే సమయంలో అక్కడ తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలు, వడగాలులు, ఉక్కపోత, వల్ల చాలామంది యాత్రికులు అనారోగ్యం పాలయ్యారు. వీటి ప్రభావానికి ఏకంగా 1300 మంది మృతి చెందారు. అదే సమయంలో పాకిస్థాన్‌కు చెందిన అసిఫ్ బషీర్ అనే అధికారి.. మీనాలో హజ్ అసిస్టెంట్‌గా అక్కడ విధులు నిర్వహిస్తున్నారు.
Also Read: పుణేను వణికిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్.. ఇప్పటికే 73 మంది
తీవ్రమైన ఎండల కారణంగా అపస్మారక స్థితిలో వెళ్లిన పలువురు యాత్రికులకు ఆయన తన టీమ్‌తో కలిసి ప్రథమ చికిత్స చేసి వైద్య సేవలు అందించారు. 17 మంది భారతీయులతో పాటు 26 మందిని అసిఫ్ బషీర్, తన టీమ్ సభ్యులు భుజాలపై ఎత్తుకొని ఆస్పత్రికి తరలించి వాళ్ల ప్రాణాలు కాపాడారు. ఇలాంటి సేవలు చేసినందుకుగాను పాకిస్థాన్ ప్రభుత్వం అసిఫ్ బషీర్‌ను గుర్తించి.. ఆ దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారమైన ‘సితారే- ఇంతియాజ్’ను ప్రదానం చేసింది. పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఈ అవార్డును ఆయనకు అందించారు.