Vijaya Sai Reddy: ''మేము అంగీకరించం, కానీ''.. విజయసాయి రెడ్డి నిర్ణయంపై స్పందించిన వైసీపీ

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన తీసుకున్న నిర్ణయంపై వైసీపీ ఎక్స్‌ వేదికగా స్పందించింది. మీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామంటూ రాసుకొచ్చింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
YSRCP MP Vijaya Sai Reddy

YSRCP MP Vijaya Sai Reddy

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సంద్భంగా ఆయన తన రాజ్యసభ పదవికి రాజీనామా కూడా చేశారు. ప్రస్తుతం ఈ అంశం ఏపీలో రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ.. విజయ సాయి రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఎక్స్‌ వేదికగా స్పందించింది. '' మీ నిర్ణయాన్ని మేము అంగీకరించనప్పటికీ.. మీరు ఎంచుకున్న విధానాన్ని మేము ఇప్పటికీ గౌరవిస్తున్నాం. పార్టీ ప్రారంభం నుంచి మీరు బలమైన పిల్లర్‌గా ఉన్నారు. కష్టాల్లో, విజయాల్లో మాతో ఉన్నారు.

మీకిష్టమైన హార్టికల్చర్‌ పనిని చేసుకోవడం కోసం రాజకీయాల నుంచి వెళ్లిపోవాలని మీరు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. పార్టీకి మీరు చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటాయి. భవిష్యత్తులో మీకు మంచి జరగాలని కోరుకుంటున్నామని'' వైసీపీ రాసుకొచ్చింది.

ఇదిలాఉండగా.. తాను రాజకీయల నుంచి తప్పుకుంటానని చెప్పిన విజయాసాయి రెడ్డి ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా తనను నమ్మి ఆదరించిన వైయస్ కుటుంబానికి రుణపడి ఉంటానన్నారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ కు, ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మకు సదా కృతజ్ఞుడినన్నారు. జగన్‌కి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు. 

పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశానన్నారు. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశానని చెప్పుకొచ్చారు. దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో తనకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీకి, హోం మంత్రి అమిత్ షాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు