Space X: వరుసగా మూడోసారి..గాల్లో పేలిన ఎలాన్ మస్క్ రాకెట్

అంతరిక్షాన్ని ఏలేద్దామనుకున్న ఎలాన్ మస్క్ కు వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. వరుసగా మూడోసారి స్పేస్ ఎక్స్ కు చెందిన స్టార్ షిప్ రాకెట్ మోసారి విఫలమైంది. గాల్లోనే పేలిపోయింది. 

New Update
rocket

star ship rocket

అంతరిక్ష పరిశోధనలు కోసం ఎలాన్ మస్క్ పెట్టిన సంస్థ స్పేస్ ఎక్స్. నాసాతో కలిసి ఈ సంస్థ ఎన్నో ప్రాజెక్టులను చేపడుతోంది. దీని ద్వారా అంతరిక్ష రంగంపై పట్టు సాధిద్ధామనుకున్నారు ఎలాన్ మస్క్. కానీ ఆయనకు వరుసపెట్టి దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా మరోసారి స్పేస్ ఎక్స్ సంస్థకు మరో ఎదురు దెబ్బ తగిలింది.  వీళ్ళ స్టార్ షిప్ మెగా రాకెట్ మరో సారి విఫలమైంది. రాకెట్ లాంచింగ్ బాగానే జరిగింది. అది ఆకాశంలోకి కూడా దూసుకెళ్లింది. కానీ కొద్ది సేపటికే అది గాల్లోనే పేలిపోయింది. స్టార్ షిప్ రాకెట్లు ఇలా పేలిపోవడం ఇది మూడో సారి. ఇంతకు ముందు రెండు సార్లు ఇలానే జరిగింది. 

రెండు నెలల క్రితం కూడా..

అంతకు ముందు మార్చి ఏడవ తేదీన స్టార్ షిప్ రాకెట్ రోదసిలోకి వెళ్ళాక అక్కడ పేలిపోయింది. డమ్మీ స్టార్ లింక్ శాటలైట్స్ తో భూ కక్ష్యలోని ప్రవేశించాల్సిన సమయంలో స్టార్ షిప్ పేలిపోయింది. దాని శకలాలు అమెరికాలోని ఫ్లోరిడా, బహమాస్ దీవుల్లోని  పడ్డాయి. జనాలు ఉన్న స్థలాల్లోనే శకలాలు పడిపోయినప్పటికీ అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ జరగలేదు. ఈ వైఫల్యంపై దర్యాప్తు చేస్తున్నామని స్పేస్ ఎక్స్ అనౌన్స్ చేసింది. అప్పట్లో దీని వీడియో కూడా తెగ వైరల్ అయింది. 

today-latest-news-in-telugu | space-x usa | Elon Musk

Also Read: Weather: ఈసారి వర్షాలు పుష్కలం..వాతావరణశాఖ

Advertisment
Advertisment
తాజా కథనాలు