South Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్టు..ఎమర్జెన్సీ తంటా!

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ ఇప్పటికే అభిశంసనకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మార్షల్‌ లా విధించి చట్టాన్ని ఉల్లంఘించినందుకు గానూ యోల్‌ ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

New Update
South Korea

South Korea: అనూహ్యంగా ఎమర్జెన్సీ ప్రకటించి పెను చిక్కులు తెచ్చుకున్నారు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌. ఇప్పటికే ఆయన అభిశంసనకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మార్షల్‌ లా విధించి చట్టాన్ని ఉల్లంఘించినందుకు గానూ యోల్‌ ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Aslo Read: BCCI: రోహిత్‌ వారసుడెవరు.. ఈ ముగ్గురు కాకుండా మరోకరిపై బోర్డు కన్ను!

బుధవారం తెల్లవారుజామున వందల మంది దర్యాప్తు అధికారులు అధ్యక్ష నివాసానికి చేరుకున్నారు. తొలుత అధ్యక్ష భద్రతా దళాలు వీరిని అడ్డుకున్నాయి. కొంతసేపు పత్రిష్టంభన నెలకొన్న తర్వాత దర్యాప్తు అధికారులు అధ్యక్ష నివాసం లోపలికి వెళ్లి యాన్‌ సుక్‌ యోల్‌ ను అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం భారీ భద్రతనడుమ ఆయనను అక్కడ నుంచి తరలించారు.గతంలో యోల్‌ను అరెస్ట్‌ చేసేందుకు ఓసారి ప్రయత్నించగా..పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆ పరిణామాలను  దృష్టిలో ఉంచుకొని నేడు భద్రతను కట్టుదిట్టం చేశారు.ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ..గతేడాది డిసెంబర్‌ లో దక్షిణ కొరియా అధ్యక్షుడు ఎమర్జెన్సీ మార్షల్‌ లా విధించారు.

Also Read: Kate Middleton: క్యాన్సర్‌ నుంచి బయటపడ్డాను: వేల్స్ యువరాణి!

దీని పై తీవ్ర వ్యతిరేకత రావడంతో యూన్‌ సుక్‌ తన ప్రకటనను విరమించుకున్నా..ఆయన తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో మార్షల్‌ లా అమలును వ్యతిరేకిస్తూ తీర్మానం తీసుకురాగా..పార్లమెంట్‌ ఏకగ్రీవంగా ఆమోదించిన సంగతి తెలిసిందే.

అనంతరం మార్షల్‌ లా అమలు చట్టవిరుద్దం అంటూ స్పీకర్‌ ప్రకటించారు.మార్షల్‌ లా ఉత్తర్వులు జారీ చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టినందుకు ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్‌ లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి.తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటేయగా..85 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో ఆయన అభిశంసనకు గురై అధ్యక్ష అధికారాలను కోల్పోయారు.మరో వైపు అత్యవసర పరిస్థితి విధించిన నేపథ్యంలో దాని పై విచారించేందుకు దర్యాప్తు అధికారులు పలుమార్లు సమన్లు జారీ చేశారు.

వాటికి ఆయన స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించగా..అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయ్యింది. ఈనేపథ్యంలో తాజాగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 

Aslo Read: Zucker Berg: మెటాలో భారీగా ఉద్యోగ కోతలు...ప్రకటించిన జుకర్‌ బర్గ్‌!

Also Read: వెంకీనా మజాకా..  అదరగొట్టిన  సంక్రాంతికి వస్తున్నాం  ఫస్ట్ డే కలెక్షన్స్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు