/rtv/media/media_files/2025/01/15/wCFUO9GgkfEmEatGUb3y.jpg)
meta
Zucker Berg: మార్క్ జూకర్ బర్గ్ నేతృత్వంలోని దిగ్గజ టెక్ సంస్థ మెటా భారీగా కోతలు విధించేందుకు రెడీ అయ్యింది. తక్కువ పనితీరు కనబరుస్తున్న వారిని గుర్తించినట్లు, వారి స్థానాలను కొత్త వారితో భర్తీ చేయనున్నట్లు బ్లూమ్ బర్గ్ వెల్లడించింది.మొత్తం 3,600 మందిని తొలగించనున్నట్లు సమాచారం. పనితీరు సామర్థ్యాన్ని పెంచే క్రమంలో తక్కువ పనితీరు కనబరుస్తున్న వారిని తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు జుకర్ బర్గ్ తెలిపారు.
Aslo Read: ఆన్‌లైన్ లవర్ కోసం ఆశపడి భర్తకు విడాకులు.. తీరా చూస్తే అది AI స్కామ్
పనితీరు ఆధారితమైన కోతలు..
కంపెనీని బలోపేతం చేసేందుకు పనితీరు ఆధారితమైన కోతలు చేపట్టినట్లు,అంతేకాకంఉడా కొత్త వారిని నియమించేందుకు ఇది ఉపకరిస్తుందన్నారు.గత సెప్టెంబర్ వరకు మెటాలో మొత్తం 72,400 మంది ఉద్యోగులు పని చేస్తుండగా..ఈ నిర్ణయం వల్ల మొత్తం 5 శాతం ఉద్యోగుల పై ప్రభావం పడే అవకాశం ఉంది.
Aslo Read: Israel-Hamas: హమాస్- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం !
పనితీరు ఆధారంగా ఉద్యోగులను తొలగించడం యూఎస్ కంపెనీల్లో సాధారణమే. గతవారం మరో దిగ్గజ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ సైతం పలు కోతలు చేపట్టినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.తన మొత్తం ఉద్యోగుల్లో ఒక శాతం కంటే తక్కువ మందిని తొలగిస్తున్నటు పేర్కొంది. అయితే ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారానికి దగ్గరపడుతున్న వేళ జుకర్ బర్గ్ నిర్ణయానికి నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడింది.
ట్రంప్ , జుకర్ బర్గ్ మధ్య గతంలో విభేదాలు ఉండేవి. 2021 లో అమెరికా పార్లమెంట్ భవంనం పై ట్రంప్ అనుయాయులు దాడి చేయడంతో ఆయనను ఫేస్‌బుక్ నుంచి బహిష్కరించారు. 2023 లో ఖాతాను పునరుద్దరించారు. అయినప్పటికీ జుకర్ పై ట్రంప్ విమర్శలు గుప్పించేవారు. అయితే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవడంతో మెటా సీఈవో తీరులో మార్పు కనపడడుతోంది.
ట్రంప్ యంత్రాంగానికి అనుకూలంగా జుకర్ బర్గ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల ట్రంప్ తో కలిసి డిన్నర్ సైతం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా గతవారం తన సామాజిక మాధ్యమ వేదికలు అయిన ఫేస్‌బుక్ , ఇన్ స్టా గ్రామ్ ల్లో ఫ్యాక్ట్ చెకింగ్ ఫీచర్ ను సైతం తొలగిస్తున్నట్లు ప్రకటించారు.ఈ ఫీచర్ సెన్సార్‌షిప్ గా పని చేస్తోందని భారీ ఎత్తున విమర్శలు వచ్చాయి.
Also Read: Rajani kanth: ఇక ఉక్కుపాతరే.. 'జైలర్ 2' టీజర్ చూస్తే గూస్ బంప్సే!
Also Read: Google: నీ గూగుల్ సెర్చ్‌కు గత్తర రాను.. చావు తర్వాత ఏమిటని వెతికి..!