వెంకీనా మజాకా..  అదరగొట్టిన  సంక్రాంతికి వస్తున్నాం  ఫస్ట్ డే కలెక్షన్స్

సంక్రాంతికి వస్తున్నాం ఫస్ట్ డే కలెక్షన్స్ అదరగొట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ. 16 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో  రూ.  2 కోట్లు .. వరల్డ్ వైడ్ గా రూ. 36 కోట్లు వసూళ్లను సాధించింది.

New Update
venky Sankranthiki Vasthunam

venky Sankranthiki Vasthunam Photograph: (venky Sankranthiki Vasthunam)

విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం  సంక్రాంతికి వస్తున్నాం.  ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను  ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.  ట్రైలర్, సాంగ్స్, ప్రమోషన్స్ తో భారీ అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా 2025 జనవరి 14వ తేదీన  భారీ అంచనాలతో రిలీజై పాజిటివ్ టాక్‌ సొంతం చేసుకుంది.  ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.  సినిమాకు  అంతటా యునానిమస్ టాక్ రావడంతో మేకర్స్ సక్సెస్  మీట్ ఏర్పాటు చేసి ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు.  

బిగ్గెస్ట్‌ అఛీవ్‌వెంట్‌

ఫ్యామిలీ ఆడియన్స్ బెనిఫిట్ షోలను చూడటమే తమకు బిగ్గెస్ట్‌ అఛీవ్‌వెంట్‌ అని అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఓ థియేటర్ కు వెళ్లి చూస్తే మహిళా ప్రేక్షకులు ఎక్కువ సంఖ్యలో ఉండటం చూసి షాక్ అయ్యానని అని చెప్పుకొచ్చారు.   సినిమాని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌ అని చెప్పుకొచ్చారు. ప్రెస్ మీట్ కు ముందు మూవీ టీమ్ అంతా కేక్ కట్ చేసి ,  టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు.  

ఈ  సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ చూసుకుంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ.  16 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.  ఇతర రాష్ట్రాల్లో  రూ.  2 కోట్లు,  ఇక కర్ణాటక, నార్త్ అమెరికా, ఇతర దేశాల్లో కలిపి ఈ సినిమా 18 కోట్లు వసూలు చేసినట్టుగా వెల్లడించాయి. వరల్డ్ వైడ్ గా రూ.  36 కోట్లు వసూళ్లను సాధించిందని తెలిపాయి.  ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం రూ.85 కోట్ల గ్రాస్ వసూలు సాధించాల్సి ఉంటుంది. సినిమా బిజినెస్ విషయానికి వస్తే..  మేకింగ్ తో పాటుగా ప్రమోషనల్ ఖర్చులకు రూ. 80 కోట్ల బడ్జెట్ అయింది.  ప్రీ రిలీజ్ బిజినెస్  రూ. 42 కోట్లు జరిగింది.   

Also Read :  Zucker Berg: మెటాలో భారీగా ఉద్యోగ కోతలు...ప్రకటించిన జుకర్‌ బర్గ్‌!

Advertisment
తాజా కథనాలు