/rtv/media/media_files/2025/01/15/fh1eiGe7QfU0eN29wbnU.jpg)
middleton
Kate Middleton: బ్రిటన్ యువరాజు విలియమ్ భార్య, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ ఓ కీలక ప్రకటనను ప్రజల ముందుకు తీసుకుని వచ్చారు. తాను క్యాన్సర్ నుంచి బయటపడ్డట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేశారు. ఇప్పుడు చాలా ఉపశమనంగా ఉందని, ఇక నుంచి పూర్తిగా కోలుకోవడం పైనే దృష్టిసారించినట్లు తెలిపారు. ఈ మేరకు విలియమ్ దంపతులు ఆసుపత్రిని సందర్శించి సిబ్బందికి కృతజ్ఙతలు తెలిపారు.
Also Read: India: రష్యాలో భారతీయుని మృతిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం..
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు క్యాన్సర్ రోగులను కలిసి వారికి మద్దతుగా నిలిచారు.''గతేడాది నేను చికిత్స తీసుకుంటున్న సమయంలో ఆసుపత్రి సిబ్బంది నన్ను చాలా బాగా చూసుకున్నారు. వారికి ధన్యవాదాలు. నేను ఇబ్బంది పడ్డ సమయంలో వారి నుంచి నాకు అందిన అన్ని సహాయ సహకారాలు చాలా గొప్పవి. రాయల్ మార్స్‌డెన్ ఆసుపత్రి సంయుక్త పోషకురాలిగా కొత్త పాత్రలోకి మారాను.
Also Read: Kallakkadal: కేరళ, తమిళనాడుకు కల్లక్కడల్ ముప్పు...
ఆసుపత్రి పరిశోధనలకు మద్దతు ఇవ్వడం, రోగి, వారి కుటుంబ శ్రేయస్సును ప్రోత్సహించడం,ఎక్కువ మంది ప్రాణాలను నిలబెట్టడం, క్యాన్సర్ బారిన పడిన వారందరి అభిప్రాయాలను మారుస్తానని నమ్మకం ఉంది. క్యాన్సర్ నుంచి బయటపడ్డందుకు ఎంతో ఉపశమనంగా ఉంది.
ఇక నుంచి పూర్తిగా కోలుకోవడం పైనే దృష్టి సారిస్తాను. సాధారణ స్థితికి రావడానికి కొంచెం సమయం పడుతుంది. క్యాన్సర్ బారిన పడిన వారికే ఇది తెలుస్తుంది. ఇక నుంచి కొత్త ఏడాదిలో చేయాల్సిన పని పై పూర్తి దృష్టి పెడతాను.ఇన్నిరోజుల నుంచి నాకు మద్దతుగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని కేట్ మిడిల్టన్ చెప్పుకొచ్చారు.
గతేడాది మార్చిలో తాను క్యాన్సర్ బారిన పడ్డట్లు కేట్ ప్రకటించిన విషయం తెలిసిందే.అప్పటి నుంచి ప్రజా జీవితానికి దూరంగా ఉన్న ఆమె..ఆసుపత్రిలో పలు దశల వారీగా కీమో థెరపీ చేయించుకున్నారు.కేట్ చికిత్స పొందిన రాయల్ మార్స్‌డెన్ ఆసుపత్రికి విలియమ్ దంపతులు దాతలుగా ఉన్నారు.
రాజ కుటుంబ సభ్యులుగా వీరు 3000 కు పైగా పలు స్వచ్ఛంద సంస్థలు, ఆసుపత్రులకు దాతలుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే విలియమ్ దంపతులు ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుంటున్న రోగులను పరామర్శించారు.
Also Read: Zucker Berg: మెటాలో భారీగా ఉద్యోగ కోతలు...ప్రకటించిన జుకర్ బర్గ్!
Also Read: గేమ్ఛేంజర్ పై నెగిటివ్ టాక్.. డైరెక్టర్ శంకర్ సంచలన కామెంట్స్