/rtv/media/media_files/2025/06/11/sfQdyhcCoPq6wuUf4ZTq.jpg)
South Korea turns off propaganda loudspeakers to North
దక్షిణ కొరియా కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర కొరియా సరిహద్దుల్లో ప్రచారం కోసం ఏర్పాటు చేసిన భారీ లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని నిషేధించింది. ఇరువర్గాల మధ్య నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు తాము ఈ చర్యలు తీసుకుంటున్నామని దక్షిణ కొరియా స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు స్వాగతిస్తున్నారు. అయితే ఈ లౌడ్‌స్పీకర్ల వల్ల అక్కడి స్థానికులు గత కొన్ని నెలలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read: స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక AXIOM-4 ప్రయెగం మళ్లీ వాయిదా
ఇటీవల దక్షిణ కొరియాకు కొత్త అధ్యక్షుడిగా లీ జేమ్యుంగ్ ఎన్నికయ్యారు. ఆయన అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరుస్తానని గట్టిగా ప్రచారం చేశారు. దీంతో ఆయనకే దక్షిణ కొరియా ప్రజలు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అయితే గతంలో దక్షిణ కొరియా నిర్వహించే ఈ భారీ స్పీకర్ల ప్రచారాన్ని ప్యాంగ్‌యాంగ్ ఓ యుద్ధ చర్య అంటూ ఆరోపించింది.
Also Read: ఈ నెలలోనే అమెరికా, భారత్ మధ్యంతర డీల్..500 బిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం
ఈ స్పీకర్లను తాము పేల్చేస్తామని కూడా ఓసారి హెచ్చరించింది. దీంతో సియోల్‌లో దాదాపు ఆరేళ్లపాటు వీటిని నిలిపివేశారు. ఆ తర్వాత ఉత్తర కొరియా నుంచి చెత్త బెలున్లు వేలసంఖ్యలో రావడం మొదలయ్యాయి. ఈ క్రమంలోనే గతేడాది జూన్‌లో భారీ స్పీకర్లను మళ్లీ ప్రారంభించారు. వీటి శబ్దాలు పగటి పూట 10 కిలోమీటర్ల వరకు, రాత్రిపూట 24 కిలో మీటర్ల వరకు వినిపిస్తాయి. అయితే గత దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ హయాంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు దారుణంగా పడిపోయాయి. అక్కడ సైనిక పాలన విధించడం, ప్రజల్లో దీనిపై వ్యతిరేకత రావడంతో ఆయన అధ్యక్ష పదవి కోల్పోయారు.
Also Read: మండుతున్న అమెరికా..ఇతర రాష్ట్రాలకు వ్యాపించిన లాస్ ఏంజెలెస్ నిరసనల సెగ