సడెన్‌గా విమానంలో చెలరేగిన మంటలు.. భయాందోళనలో ప్రయాణికులు

దక్షిణ కొరియాలో 176 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం మంటల్లో చిక్కుకుంది. బుసాన్ విమానాశ్రయం నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అధికారులు వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

New Update
South Korea flight

South Korea flight Photograph: (South Korea flight)

దక్షిణ కొరియాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల విమానం మంటల్లో చిక్కుకుంది. విమానం టేకాఫ్ చేయడానికి రెడీ అవుతుండగా విమానం వెనుక భాగంలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ సమయంలో విమానంలో దాదాపుగా 176 మంది ప్రయాణికులు ఉన్నారు. సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో పాటు సిబ్బంది అందరూ కూడా సురక్షితంగా బయటపడ్డారు. ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 

ఇది కూడా చూడండి: Cinema: జానీ మాస్టర్ పై కేసు గెలిచాం..ఫిల్మ్ ఛాంబర్

ఇది కూడా చూడండి: Maha Kumbh Mela :  మహా కుంభమేళాలో తొక్కిసలాట.. అమృత స్నానాలపై అఖండ పరిషత్‌ కీలక నిర్ణయం

హాంకాంగ్‌కు వెళ్తున్న విమానం..

బుసాన్ నుంచి హాంకాంగ్‌కు A321 విమానం వెళ్లడానికి రెడీ అవుతోంది. రాత్రి 10:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తీసుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రయాణికులను గాలితో నిండిన స్లయిడ్ ఉపయోగించి ఖాళీ చేయించారు. అయితే ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు. అసలు ఒక్కసారిగా విమానంలో మంటలు ఎందుకు వచ్చాయి? దీనికి గల కారణాలు ఏంటనే విషయంపై దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చూడండి: Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి విదేశయాన ప్రయత్నాలు సులభం అవుతాయి..!

ఇదిలా ఉండగా.. గత నెల కూడా ఇలాంటి ప్రమాద ఘటనే దక్షిణ కొరియాలో  జరిగింది. దురదృష్టశాత్తు ఈ ప్రమాదంలో 179 మంది మరణించారు. విమానం ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడం వల్ల మంటలు చెలరేగి మృతి చెందారు.

ఇది కూడా చూడండి: Big Breaking: కుంభమేళాలో తొక్కిసలాట ..17 మంది మృతి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు