ఢిల్లీలో పార్లమెంట్ భవన్ దగ్గర ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్‌కు చెందిన జితేద్ర అనే వ్యక్తి ఆత్యహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో శరీరం తీవ్రంగా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెంటనే చేరుకుని జితేంద్రను కాపాడే ప్రయత్నం చేశారు. బాధితుడిని వెంటనే రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి పెట్రోలు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. జితేంద్ర పెట్రోల్ పోసుకుని నిప్పంటిచుకున్నాడని...అందుకే అతని శరీరం చాలా ఎక్కువ భాగం కాలిపోయిందని ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారి చెప్పారు.
ఈ ఘటన తర్వాత పార్లమెంట్ ముదు భద్రతా సిబ్బందిని మోహరించారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి యూపీలోని బాగ్‌పత్ నివాసి అని తెలిసింది. అతని పేరు జితేంద్రగా గుర్తించాం. వయసు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుంది. జితేంద్ర శరీరం 90 శాతం కాలి పోయింది. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో అతనిపై నమోదైన కేసు కారణంగా అతను కలత చెందాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదు అని తెలిపారు. దీంతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసు భద్రతను పెంచారు. పోలీసు బృందాలు నిరంతరం గస్తీ తిరుగుతున్నాయి. వాహనాల సోదాలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.