South Korea: దక్షిణ కొరియాలో పెరుగుతున్న వృద్ధుల సంఖ్య.. ఆందోళనలో ప్రభుత్వం
దక్షిణ కొరియా సూపర్ ఏజ్డ్ సొసైటీగా మారినట్లు అధికారిక నివేదికలు చెబుతున్నాయి. ఆ దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరు 65 ఏళ్లు పైబడిన వారే ఉండటం గమనార్హం. 2008లో అక్కడి వృద్ధ జనాభా 49 లక్షలు ఉండగా.. 2024 నాటికి అది రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది.