Australia: ఆస్ట్రేలియాలో పహల్గాం తరహా ఉగ్రదాడి.. 11 మంది మృతి

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో బాండి బీచ్‌లో ఆదివారం సాయంత్రం కాల్పులు జరగడం కలకలం రేపింది. ఈ దాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. పర్యాటకులు ఉల్లాసంగా గడుపుతుండగా ఇద్దరు గన్‌మెన్లు బీజ్‌లోకి దూసుకొచ్చి ఫైరింగ్ చేశారు.

New Update
11 killed in Australian shooting targeting Jewish community

11 killed in Australian shooting targeting Jewish community

ఆస్ట్రేలియా(australia) లోని సిడ్నీ(Sidney) లో బాండి బీచ్‌లో ఆదివారం సాయంత్రం కాల్పులు జరగడం కలకలం రేపింది. ఈ దాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. పర్యాటకులు ఉల్లాసంగా గడుపుతుండగా ఇద్దరు గన్‌మెన్లు బీజ్‌లోకి దూసుకొచ్చి ఫైరింగ్ చేశారు. దీంతో అక్కడుకున్న పర్యాటుకులు భయంతో పరుగులు తీశారు. నల్లటి ముసుగులతో ఇద్దరు వ్యక్తులు పాదచారుల వంతెనపైకి వచ్చి కాల్పులు జరిపినట్లు అక్కడున్న స్థానికులు తెలిపారు. ఓ కార్యక్రమాన్ని టార్గెట్‌గా చేసుకుని ఈ దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  

Also Read: కమ్యూనిస్టుల కంచు కోట బద్దలు.. కేరళ లోకల్ ఎలక్షన్స్ లో దుమ్ములేపిన BJP

11 Killed In Australian Shooting

ఈ ఘటన తర్వాత భద్రతా దళాలు వెంటనే రంగంలోకి దిగాయి. క్షతగాత్రులను కాపాడేందుకు హెలికాప్టర్లు, అంబులెన్స్‌లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. అయితే కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకరు షూటింగ్‌లో చనిపోయినట్లు తెలుస్తోంది. మరొకరిని సిడ్నీ భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. నిందితుడిని 24 ఏళ్ల నవీద్ అక్రమ్‌గా గుర్తించాయి. ఈ ఘటనకు సంబంధించి వివిధ కోణాల్లో అతడిని పోలీసులు విచారిస్తున్నారు. అలాగే అక్రమ్ ఇంట్లో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. గత కొన్నేళ్లలో జరిపిన కాల్పులపై కూడా పోలీసులు అతడిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.  

బాండి బీచ్‌లో యూదులు హనుక్కా వేడుకలు జరపుకుంటుండగా దుండగులు ఈ కాల్పులకు పాల్పడ్డట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దాడిలో 29 మంది గాయపడగా వారిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఇది ఉగ్రవాదుల చర్యే అని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Also Read: ఢిల్లీని ఆక్రమిస్తాం.. పాక్‌ ఉగ్రవాది సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు