Pakistan: పాకిస్థాన్‌లో మైనారిటీలపై హింస.. పాస్టర్‌ను హత్య చేసిన దుండగులు..

పాకిస్థాన్‌లో మైనారిటీలపై దాడులకు రోజురోజుకు పెరుగుతన్నాయి. ఇటీవల ఓ పాస్టర్‌ను హత్య చేయడం దుమారం రేపింది. ఈ ఘటనను మైనారిటీ కమ్యూనిటీ మానవ హక్కుల సంస్థ తీవ్రంగా ఖండించింది.

New Update
Christian pastor murdered in Pakistan

Christian pastor murdered in Pakistan

పాకిస్థాన్‌లో మైనారిటీలపై దాడులకు రోజురోజుకు పెరుగుతన్నాయి. ఇటీవల ఓ పాస్టర్‌ను హత్య చేయడం దుమారం రేపింది. ఈ ఘటనను మైనారిటీ కమ్యూనిటీ మానవ హక్కుల సంస్థ తీవ్రంగా ఖండించింది. వాయిస్ ఆఫ్‌ పాకిస్థాన్ మైనారిటీసీ (VOPM) వెల్లడించిన వివరాల ప్రకారం.. పంజాబ్‌ ప్రావిన్స్‌లో డిసెంబర్ 5న పాస్టర్ కమ్రాన్ అనే వ్యక్తి తన కూతురును కళాశాలలో దిండానికి కారులో బయలుదేరినప్పుడు ఈ దాడి జరిగింది. పలువురు దుండగులు బైక్‌పై వచ్చి అతడిపై కాల్పులు జరిపారు. 

Also Read: భారత్‌లో టెలికాం, బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఎయిర్‌పోర్ట్స్‌ రంగాల్లో ఏ సంస్థకు ఎంత వాటా ఉందో తెలుసా ?

దీంతో తీవ్రంగా గాయాలపాలైన కమ్రాన్‌ను ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందతూ అతడు మరణించాడు. దీంతో పాక్‌లో ఉన్న క్రైస్తవ కమ్యూనిటీ షాక్‌కు గురైంది. కమ్రాన్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అంతేకాదు రెండు నెలల క్రితం కూడా ఇస్మామాబాద్‌లో కామ్రాన్‌పై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఆ సమయంలో ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. ఇటీవల జరిగిన దాడిలో అతడు మరణించడం దుమారం రేపింది. 

Also Read: అమెరికా వెళ్లేవారికి బిగ్ షాక్‌.. హెచ్‌-1బీ వీసా అపాయింట్‌మెంట్లు వాయిదా

ఈ క్రమంలోనే ఈ ఘటనను తాజాగా  మైనారిటీ కమ్యూనిటీ మానవ హక్కుల సంస్థ తీవ్రంగా ఖండించింది. ఈ మైనారిటీల హక్కులను అణగదొక్కేలా ఈ దాడి ప్రదర్శిస్తుందని మండిపడింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించకపోవడం కూడా సమాజ శక్తిహీనతను తెలియజేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఈ హత్య ఘటనపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. 

Advertisment
తాజా కథనాలు