Canada: టొరంటో పబ్ లో కాల్పులు.. 12 మంది..!

కెనడాలోని టొరంటోలో పబ్‌ లో జరిగిన కాల్పుల ఘటనలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపిన నిందితుడు పారిపోయాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

New Update
canada

canada

కెనడాలోని టొరంటోలో పబ్‌ లో జరిగిన కాల్పుల ఘటనలో కనీసం 12 మంది గాయపడ్డారు. స్కార్‌బరోలోని ఒక పబ్‌లో జరిగిన కాల్పుల ఘటనపై టొరంటో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పారిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే అతన్ని పట్టుకోవడానికి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాల్పులు జరిగినట్లు సమాచారం అందిన వెంటనే రాత్రి 10:40 గంటల ప్రాంతంలో ప్రోగ్రెస్ అవెన్యూ,  కార్పొరేట్ డ్రైవ్ సమీపంలో అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

Also Read: Nagababu: నాగబాబుకు రూ.59 కోట్ల ఆస్తి, బెంజ్ కారు.. చిరు, పవన్ దగ్గర అప్పు.. అఫిడవిట్ లో ఆసక్తికర విషయాలు!

 బాధితులకు స్వల్ప గాయాల నుండి తీవ్ర గాయాలైనట్లు వైద్య సిబ్బంది నిర్ధారించారు. అనేక మందిని అత్యవసర చికిత్స కోసం ట్రామా సెంటర్లకు తరలించారు. సహాయక చర్యల కోసం అగ్నిమాపక సిబ్బందిని కూడా పిలిపించినట్లు కెనడియన్ వార్తా వెబ్‌సైట్ CBC నివేదించింది. అయితే, బాధితుల గురించి అధికారులు ఇంకా వివరాలను విడుదల చేయలేదు.

Also Read: Rains: రైతులకు షాక్.. ఈ ఏడాది వానలు అంతంత మాత్రమే.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే!?

కాల్పులు జరిపిన వ్యక్తి గురించి ఏవైనా వివరాలు తెలిస్తే తమకు తెలియజేయాలని పోలీసులు ప్రజలను కోరారు. పబ్ దగ్గర కమాండ్ పోస్ట్ ఏర్పాటు చేసి, ఎల్లెస్మెర్ & హైవే 401 మధ్య ప్రోగ్రెస్ అవెన్యూను మూసివేసినట్లు టొరంటో పోలీసులు తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాలను తీసుకోవాలని పోలీసులు ప్రజలను కోరారు.

ప్రాథమిక అంచనాలో, నిందితుడు నల్లటి బాలాక్లావా ధరించి ఉన్నాడని, సిల్వర్‌ కలర్ కారులో పారిపోతున్నట్లు కనిపించాడని పోలీసులు తెలిపారు.టొరంటో మేయర్ ఒలివియా చౌ మాట్లాడుతూ: "స్కార్‌బరోలోని ఒక పబ్‌లో కాల్పులు జరిగాయనే వార్తలను విని నేను చాలా బాధపడ్డాను. నేను చీఫ్ డెమ్కివ్‌తో మాట్లాడాను.  అవసరమైన అన్ని వనరులను అందజేయాలని అధికారులకు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. 

Also Read: SLBC breaking : టన్నెల్ ప్రమాదంలో కీలక పురోగతి....కార్మికుల ఆన‌వాళ్లు గుర్తించిన కేర‌ళ జాగిలాలు

Also Read: SLBC Tunnel Rescue Operation : ఆ ఎనిమింది మంది జాడేది? కొనసా...గుతున్న రెస్క్యూ ఆఫరేషన్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు