/rtv/media/media_files/2025/09/24/sexual-harassment-at-sringeri-peeth-2025-09-24-12-51-38.jpg)
Sexual harassment at Sringeri Peeth
Crime News : దేశ రాజధాని ఢిల్లీలోని శృంగేరి పీఠం బ్రాంచ్‌లో దారుణం చోటు చేసుకుంది. పేద విద్యార్థినులకు విద్యాదానం చేస్తామని ప్రారంభించిన ఆశ్రమ నిర్వాహకుడు అక్కడి బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వసంత్ కుంజ్ ప్రాంతంలో ఉన్న శ్రీ శారదా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారథి తమను లైంగికంగా వేధించాడంటూ 17 మంది విద్యార్థినులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. శృంగేరి పీఠానికి అనుబంధంగా కొనసాగుతున్న ఈ ఇనిస్టిట్యూట్‌లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోటా విద్యార్థినీలకు విద్యను అందిస్తారు. కాగా ఇక్కడ స్కాలర్‌షిప్‌తో పోస్ట్-గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ కోర్సులు చదువుతున్న విద్యార్థినులను లక్ష్యంగా చేసుకున్న స్వామి చైతన్యానంద వారిపట్ల అసభ్యకరమైన భాష వాడటం, వారికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపడం, బలవంతంగా తాకడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు బాధితులు పోలీస్ స్టేషన్‌లో తమ వాంగ్మూలం ఇచ్చారు. అంతేకాక స్వామి చెప్పినట్లు చేయాలంటూ కొందరు వార్డెన్లు, మహిళా సిబ్బంది కూడా తమపై ఒత్తిడి తెచ్చారని విద్యార్థినీలు ఆరోపించారు.
ఇది కూడా చూడండి: Amazon Great Indian Festival Sale: గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై 50 శాతం డిస్కౌంట్లు.. అమెజాన్‌లో కళ్లు చెదిరే ఆఫర్లు!
కాగా బాధిత విద్యార్థినీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. సౌత్-వెస్ట్ జిల్లా డీసీపీ అమిత్ గోయల్ మాట్లాడుతూ స్వామి చైతన్యానందపై లైంగిక వేధింపులతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు. అయితే, విషయం బయటకు పొక్కడంతో స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారథి అక్కడ నుంచి పారిపోయాడు. ఆయన కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అతను పారిపోతున్న సమయంలో చివరిసారిగా ఆగ్రా సమీపంలో అతని కదలికలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇక పోలీసులు ఆశ్రమంలో తనిఖీలు చేయగా నిందితుడు ఉపయోగించిన వోల్వో కారును గుర్తించారు. ఆ కారుకు నకిలీ డిప్లొమాటిక్ నంబర్ ప్లేట్ (39 యూఎన్ 1) ఉన్నట్లు తేలడంతో దాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Also Read: కోల్‌కతాలో రికార్డు స్థాయిలో వర్షం.. 9 మంది మృతి, 30 విమానాలు రద్దు
సంబంధాలు తెంచుకున్న శృంగేరి పీఠం
ఇదిలా ఉండగా ఈ విషయం బయటకు రాగానే దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శృంగేరి శ్రీ శారదా పీఠానికి చెందిన బ్రాంచ్ కావడంతో ఈ ఘటన సంచలనంగా మారింది. దీనిపై శృంగేరి పీఠం వెంటనే స్పందించింది. స్వామి చైతన్యానంద చర్యలు చట్టవిరుద్ధమని, పీఠం నియమాలకు వ్యతిరేకమని స్పష్టం చేసింది. అతడిని పదవి నుంచి తొలగించడమే కాకుండా, పీఠంతో అతనికి ఉన్న అన్ని సంబంధాలను పూర్తిగా తెంచుకున్నట్లు వెల్లడించింది.
ఇది కూడా చూడండి: Stock Market: వెంటాడుతున్న హెచ్ 1బీ వీసాల భయం..వరుసగా రెండో రోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్