Space: అద్భుతం.. అంతరిక్షంలోకి తీసుకెళ్లిన విత్తనాలకు మొలకలు

అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. తాజాగా అంతరిక్షంలో చేసిన ఓ పరిశోధన అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్కడికి తీసుకెళ్లిన విత్తనాలకు మొలకలు వచ్చాయి.

New Update
ISRO successfully germinated cowpea seeds in space

ISRO successfully germinated cowpea seeds in space

రోజులు మారుతున్నాయి. భూమి, నీరు, ఆకాశం ఇలా అన్నింటిపైనా మానవుడు కొత్త కొత్త పరిశోధనలు చేస్తూ మార్పులకు శ్రీకారం చుడుతున్నాడు. ముఖ్యంగా అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. తాజాగా అంతరిక్షంలో చేసిన ఓ పరిశోధన అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్కడికి తీసుకెళ్లిన విత్తనాలకు మొలకలు వచ్చాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల శుభాంశు శుక్లా బృందం అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వాళ్లతో మెంతులు, మినుముల విత్తనాలను ISSకు పంపించారు. 

Also Read: అమెరికాలో హై టెన్షన్.. ట్రంప్ సన్నిహితుడి దారుణ హత్య!

ఆ తర్వాత శుభాంశు శుక్లా బృందం తిరిగి భూమిపైకి వచ్చినప్పుడు ఆ విత్తనాలను తీసుకొచ్చారు.  తాజాగా అవి మొలకెత్తాయి. ఈ విషయాన్ని కర్ణాటకలోని ధార్వాడ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డా.రవికుమార్‌ వెల్లడించారు. ఆ విత్తనాలను అంతరిక్షం నుంచి భూమి పైకి తీసుకొచ్చాక మైనస్ 80 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న పెట్టేలో ధార్వాడకు తీసుకొచ్చారు. తాజాగా ఆ విత్తనాల్లో జన్యు, నిర్మాణ మార్పులు , వాతారవణంలో ప్రేరేపించిన జీవక్రియ లాంటి తేడాలు తెలుసుకునేందుకు కొన్నింటిని బయటకు తీసి టెస్ట్ చేశారు. ఆ విత్తనాలు విజయవంతంగా మొలకెత్తాయని రవికుమార్ చెప్పారు. వాతావరణ మార్పులను తట్టుకోగలిగే గట్టి వంగడాల తయారీకి తాము కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

Also Read: చంద్ర గ్రహణానికి నలుగురు పీఎమ్ లు బలి..సూర్య గ్రహణనాకి ఆయనే.. గోయేంకా ఇంట్రెస్టింగ్ ట్వీట్

ఇదిలా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా మరో అద్భుతాన్ని సృష్టించింది. గతంలో మార్స్‌(అంగారకుడు)పైకి నాసా మార్స్‌ రోవర్‌ పెర్సివరెన్స్‌ను పంపిన సంగతి తెలిసిందే. అయితే ఆ రోవర్ తాజాగా ఆ గ్రహంపై  ఓ నది కాలువలో కొన్ని రాళ్లను గుర్తించింది. ఆ రాళ్లలో పురాతన సూక్ష్మజీవానికి సంబంధించి ఆనవాళ్లు ఉండే ఛాన్స్ ఉందని పరిశోధకలు భావిస్తున్నారు. ఈ నమునాలను భూమిపై ప్రయోగశాలలో పరిశీలించిన తర్వాతే దీనిపై స్పష్టత రానుంది. పెర్సివరెన్స్ రోవర్‌.. 2021 నుంచి అంగారకుడిపై పరిశీలనలు సాగిస్తోంది.

ఏంటి పర్సివరెన్స్ రోవర్ ?

పర్సివరెన్స్ రోవర్ అనేది నాసా (NASA) అభివృద్ధి చేసిన రోబోటిక్ రోవర్. ఇది అంగారక గ్రహం (Mars) ఉపరితలంపై జీవానికి సంబంధించిన ఆనవాళ్లు కనుగొనేందుకు పంపించారు. ఈ రోవర్ ఒక కారు సైజు ఉంటుంది. 2021లో ఫిబ్రవరి 18న మార్స్‌పై విజయవంతంగా ల్యాండ్ చేశారు. ఈ రోవర్‌ ఆ గ్రహంపై మట్టిని, రాళ్లను సేకరిస్తోంది. వాటి శాంపిల్స్‌ను నిల్వచేస్తుంది. భవిష్యత్తులో అక్కడికి పంపే మరో మిషన్ ద్వారా ఈ శాంపిల్స్‌ను భూమిపైకి తీసుకొచ్చేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఈ రోవర్‌కు  23 కెమెరాలతో పాటు, రెండు మైక్రోఫోన్‌లు కూడా ఉన్నాయి. వీటి ద్వారా ఆ గ్రహంపై మొదటిసారిగా శబ్దాలు కూడా రికార్డ్ అయ్యాయి. దీనికి స్వతంత్రంగా కదలగలిగే శక్తి ఉంటుంది. అంతేకాదు తన మార్గాన్ని కూడా అదే నిర్ణయించుకుంటుంది. ఇలా మార్స్‌పై ఆ రోవర్‌ తిరుగుతూ కావాల్సిన శాంపిల్స్‌ను సేకరిస్తునే ఉంది . 

Advertisment
తాజా కథనాలు