US-Venezuela: మాదక ద్రవ్యాల నుంచి చమురుకు..ముదిరిన అమెరికా, వెనిజులా యుద్ధం..

అమెరికా, వెనిజులాల యుద్ధం ఇప్పుడు మరింత ముదిరింది. మాదక ద్రవ్యాలతో మొదలైన యుద్ధం ఇప్పుడు చమురు దగ్గరకు చేరుకుంది. వెనిజులా చమురు, ఇంధన హక్కులు మావే అంటూ అధ్యక్షుడు ట్రంప్ బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. 

New Update
us-venezula

అమెరికా, వెనిజులా మధ్య కొనసాగుతున్న వివాదం యుద్ధంగా మారింది. నిన్నటి వరకు వెనిజులా మాదక ద్రవ్యాలను ఆపడమే తన లక్ష్యమని చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు ఏకంగా ఆ దేశాన్నే ఆక్రమించుకోవడానికి చూస్తున్నారు. ముఖ్యంగా వెనిజులా చమురు, ఇంధన హక్కులను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని గురించి ఆయన బహిరంగంగానే ప్రకటన చేస్తున్నారు. ట్రంప్ చెబుతున్న దాని ప్రకారం అమెరికా ఆధీనంలో ఉండాల్సిన చమురు, ఇంధన హక్కులను వెనిజులా ప్రభుత్వం చట్ట విరుద్ధంగా స్వాధీనం చేసుకుంది. అందుకు ఇప్పుడు దానిని అమెరికా అమెరికాకు తిరిగి ఇచ్చేయాలని తాను కోరుతున్నానని చెబుతున్నారు. ఇప్పటికే యూఎస్ సైన్యాన్ని వెనిజులా సముద్రంలో మోహరించింది. దాంతో పాటూ వెనిజులాపై నావికా దిగ్బంధం విధించారు. ఆ దేశం దొంగలించిన చమురు, దాని సంబంధిత ఆస్తులను ఇచ్చేవరకు ఇది కొనసాగుతుందని ట్రంప్ తెగేసి చెబుతున్నారు. 

Also Read: JIO కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. ఫ్రీగా రూ.35 వేల బెనిఫిట్స్!

యుద్ధం తప్పదంటున్న అమెరికా..

వెనిజులాపై అమెరికా యుద్ధానికి దిగిందన్నది స్పష్టం అవుతోంది. మాదక ద్రవ్యాల మొదలెట్టిన యుద్ధం ఇప్పుడు చమురు నిల్వల వరకు వెళ్ళింది. దీనికి సంబంధించి  ట్రంప్ సన్నిహితుడు, వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ కూడా వివాదాస్పద ప్రకటన చేశారు. వెనిజులా చమురు వాస్తవానికి అమెరికాకు చెందినదని, అక్కడ చమురు పరిశ్రమను జాతీయం చేయడం దొంగతనమని ఆయన ట్రంప్ వాదనను సమర్థించారు. వెనిజులా చమురు పరిశ్రమ అమెరికన్ శ్రమ, సాంకేతికత, మూలధనంతో నిర్మించబడిందని మిల్లర్ చెప్పారు. అక్కడి ప్రభుత్వం దానిని బలవంతంగా స్వాధీనం చేసుకుని, దోచుకున్న డబ్బును ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి, మాదకద్రవ్యాలను వ్యాప్తి చేయడానికి ఉపయోగించిందని ఆయన ఆరోపించారు. మరోవైపు వెనిజులాపై ట్రంప్ గవర్నమెంట్ యుద్ధం మొదటి నుంచీ మాదక ద్రవ్యాలపై కాదని, చమురు కోనమేనని డెమోక్రటిక్ నేతలు ఆరోపిస్తున్నారు. మరో కొత్త యుద్ధానికి తెర తీస్తున్నారని అంటున్నారు. 

అసలేంటీ వివాదం..

నిజానికి అంతర్జాతీయ చట్టం ప్రకారం..ఒక దేశానికి దాని సహజ వనరులపై హక్కు ఉంటుంది. వెనిజులా 1976లో తన చమురు పరిశ్రమను జాతీయం చేసి, దానిని ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీ PDVSA కిందకు తీసుకువచ్చింది. 2007లో అప్పటి అధ్యక్షుడు హ్యూగో చావెజ్ మిగిలిన విదేశీ చమురు ప్రాజెక్టులను జాతీయం చేశారు. దీంతో ఎక్సాన్ మొబిల్, కోనోకో ఫిలిప్స్ వంటి అమెరికన్ కంపెనీలు నిష్క్రమించాల్సి వచ్చింది. అప్పుడే అమెరికన్ కంపెనీలు దీనిని చట్టబద్ధంగా సవాలు చేశాయి. 2014లో ప్రపంచ బ్యాంకు ట్రిబ్యునల్ వెనిజులాను ఎక్సాన్ మొబిల్‌కు $1.6 బిలియన్లు చెల్లించాలని ఆదేశించింది. ఈ విషయం ఇప్పటికీ పూర్తిగా పరిష్కారం కాలేదు. ట్రంప్ తన మునుపటి పదవీకాలంలో కూడా వెనిజులా ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీ PDVSAపై ఆంక్షలు విధించారు. ఇప్పుడు కూడా ఇదే విషయంపై ట్రంప్ వెనిజులాపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. 

ఇందులో భాగంగానే ట్రంప్ రీసెంట్ గా వెనిజులా చమురు ట్యాంకర్లపై దిగ్బంధనను ప్రకటించారు. దక్షిణ అమెరికాలో ఇప్పటివరకు అతిపెద్ద నావికా దిగ్బంధనను వెనిజులా ఎదుర్కొంటుందని, దొంగిలించబడిన అమెరికా ఆస్తిని తిరిగి ఇచ్చే వరకు ఇది కొనసాగుతుందని ఆయన చెప్పారు. దీనికితోడు వెనిజులా తీరంలో అమెరికా ఒక చమురు ట్యాంకర్‌ను కూడా స్వాధీనం చేసుకుంది. మరోవైపు అమెరికాను వెనిజులా చాలా గట్టిగా ఎదుర్కొంటోంది. చమురు ట్యాంకర్ స్వాధీనం చేసుకోవడాన్ని అంతర్జాతీయ పైరసీగా అభివర్ణించింది.

#usa #oil #today-latest-news-in-telugu #trump venezuela war #us vs venezuela
Advertisment
తాజా కథనాలు