Trump: ట్రంప్ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు.. భారత్‌ తరఫున ఎవరు వెళ్లనున్నారంటే ?

జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. వివిధ దేశాలకు అమెరికా ఆహ్వానం పంపుతోంది. భారత్‌ తరఫున కేంద్ర మంత్రి జై శంకర్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

New Update
Donald Trump

Donald Trump


గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ గెలిచిన సంగతి తెలిసిందే. జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ వేడుకకు హాజరుకావాలని అమెరికా వివిధ దేశాలకు ఆహ్వానం పంపుతోంది. భారత్‌కు కూడా ఆహ్వానం అందింది. మన దేశం తరఫున కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఈ వేడుకకు హాజరుకానున్నారు.  

Also Read: ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలేంటో తెలుసా ?

47వ అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి జైశంకర్ భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అమెరికా పర్యటనలో ఆయన ట్రంప్‌తో పాటు ఇతర నేతలు, ప్రముఖుల్ని కలవనున్నట్లు పేర్కొంది. అయితే వైట్‌హౌస్ భవనం ముందు అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. అధ్యక్షునిగా ప్రమాణం చేసిన తర్వాత ట్రంప్‌ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కూడా హాజరుకానున్నారు. 

Also Read: ఉద్యోగం కోసం డిజిటల్ చీటింగ్.. చివరికి ఏమైందంటే?

అయితే 2020 ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో జోబైడెన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ట్రంప్ హాజరుకాలేదు. కానీ జోబైడెన్ మాత్రం ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. అలాగే ఈ వేడుకకు అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. 

Also Read: మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు రూ.8,500: కాంగ్రెస్

Also Read: సైనిక్ స్కూల్ 2025 ఎంట్రన్స్ అప్లికేషన్ లాస్ట్‌డేట్ ఇదే.. వెంటనే అప్లై చేయండి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు