/rtv/media/media_files/2025/01/12/xXlNM4TSyLeW5JSJAeUO.jpg)
Congress Party Leaders
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార, విపక్ష పార్టీలు జోరుగు ప్రచారాలు చేస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు వరాల జల్లులు కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు యువ ఉడాన్ యోజన పథకం కింద రూ.8,500 ఇస్తామని ప్రకటించింది. అయితే ఇది ఉచితంగా ఇచ్చే సొమ్ము కాదని తెలిపింది. దీనికి సంబంధించి ఆ పార్టీ నేత సచిన్ పైలట్ మాట్లాడారు. ఏదైనా కంపెనీలో లేదా ఫ్యాక్టరీలో తమకున్న స్కిల్స్‌ను చూపించిన యువతకు ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. ఈ కంపెనీల నుంచి వారు సొమ్ము పొందుతారన్నారని చెప్పారు.
Also read: లాస్‌ఏంజెలెస్‌లో ఆగని కార్చిచ్చు.. మంటల్లో ప్రియాంక చోప్రా ఇల్లు !
ఈ పథకం ఇళ్లల్లో ఖాళీగా కూర్చొనేవారికి ఇచ్చేది కాదని స్పష్టం చేశారు. ప్రజలు శిక్షణ పొందిన రంగాల్లో స్థిరపడేందుకే ఈ స్కీమ్ తీసుకొచ్చామని వెల్లడించారు. ఇదిలాఉండగా జనవరి 6న కాంగ్రెస్ ప్యారీ దీదీ యోజన స్కీమ్‌ను కూడా ప్రకటించింది. తాము గెలిస్తే ఈ పథకం కింద మహిళలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చింది. అలాగే జనవరి పార్టీ జీవన్ రక్షా యోజనను ప్రకటించింది. ఈ స్కీమ్ కింద ఒక కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచిత బీమా సౌకర్యం ఇస్తామని తెలిపింది.
Also Read: సైనిక్ స్కూల్ 2025 ఎంట్రన్స్ అప్లికేషన్ లాస్ట్‌డేట్ ఇదే.. వెంటనే అప్లై చేయండి
ఇక ఫిబ్రవరి 5న ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. పార్లమెంటు ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, ఆప్ ఈసారి మాత్రం విడివిడిగా పోటీ చేస్తున్నారు. మరోవైపు ఆప్, కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒకరికొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ ఇటీవల బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికలపై మరింత ఆసక్తి నెలకొంది. ఈసారి ఢిల్లీ ప్రజలు ఏ పార్టీకి అధికారం అప్పగిస్తారో అనేది దేశవ్యాప్తంగా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.