విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఇంజిన్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది. రష్యా నుంచి తుర్కియేకు బయలుదేరిన విమానంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. అజిముత్ ఎయిర్‌లైన్స్ చెందిన సుఖోయ్ సూపర్ జెట్ విమానం ఆదివారం రాత్రి రష్యాలోని సోచి నుంచి తుర్కియేకు బయలుదేరింది. ఈ విమానంలో 95 మంది ప్రయాణికులు ఉన్నారు.
అంతల్యా ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యే సమయానికి ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పైలట్ వెంటనే విమానాన్ని రన్‌వేపై ర్యాష్ ల్యాండింగ్ చేశాడు. సమయానికి ఎయిర్‌పోర్టు సిబ్బంది కూడా స్పందించారు. పైలట్ సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టారు. అలాగే ప్రయాణికులు అత్యవసర ద్వారం నుంచి కిందకి దిగారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Union Cabinet: పాన్ కార్డ్ 2.0కి కేంద్ర కేబినెట్ ఆమోదం..
Russian Plane Engine Catches Fire
Also Read : ల్యాండ్‌మైన్స్ ఉత్పత్తిపై నిషేధం.. ఐరాస చీఫ్ కీలక ప్రకటన!
Also Read: అదానీకి మరో షాక్..పెట్టుబడులు పెట్టేందుకు నిరాకరించిన టోటల్ ఎనర్జీస్
ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు రష్యా ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ రోసావియాట్సియా చెప్పారు. అగ్ని ప్రమాదానికి గురైన ఆ సుఖోయ్ సూపర్‌జెట్ విమానం గత ఏడేళ్లుగా వినియోగంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా.. ఈ మధ్యకాలంలో వరుసగా విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సాంకేతిక లోపాల కారణాల వల్ల విమాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవ్వడం, టేకాఫ్ అవ్వకపోవడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి.
Also Read: Iran: ఇజ్రాయెల్ ప్రధానికి మరణశిక్ష విధించాలి–ఇరాన్ సుప్రీం లీడర్.